Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. రెండు వారాలు ఎలిమినేషన్ జరిగిన తర్వాత మూడో వారం కాస్త ఆసక్తిగా మారుతుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరకు బయటకు వెళ్తారో అన్నది ప్రేక్షకులను టెన్షన్ పెట్టిస్తుంది. ఇక రాను రాను టాస్క్ కు టఫ్ గా మారాయి. అయితే నిన్న జరిగిన ప్రభావతి టాస్క్ హౌస్ మెట్స్ కు అసంతృప్తిని కలిగించింది. దాంతో బిగ్ బాస్ పైనే సెటైర్స్ వేశారు దానికి సీరియస్ అయిన బిగ్ బాస్ ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చు అని వార్నింగ్ ఇచ్చాడు. ఇకపోతే సోనియా బుద్దెంటో బయటపడింది..
బిగ్ బాస్ తెలుగు 8 లో రోజుకో ట్విస్ట్.. హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏక్షణం ఎవరు ఎలా మారుతున్నాతో అర్ధం కావడంలేదు. మొదటి నుంచీ హౌస్ లో విలన్ పాత్రను పోషిస్తుంది సోనియా.. తనని సేవ్ చేసుకొనే క్రమంలో అవతల వారిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆమె బుద్ది మరోసారి బయట పడింది. హౌస్ లో ఎంతో స్ట్రాంగ్ గా ఉంటూ.. హౌస్ ను నడిపిస్తూ వస్తున్న నిఖిల్ ను ఎమోషనల్ గా వీక్ చేస్తోంది సోనియా. తాను అనుకున్నది సాధించడం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. అనుకున్నది సాధిస్తూ వస్తోంది.. ఇప్పుడు కూడా అదే జరిగింది.
శక్తి టీమ్ లో గొడవలు పెట్టేందుకు నిఖిల్ ను మార్చేస్తుంది. తన మాటలతో గారడి చేస్తుంది. నిఖిల్ తో మొదటి నుంచీ క్లాజ్ గా ఉంటూ వస్తున్న సోనియా.. అతన్ని దూరం పెడుతూ.. ఎమోషనల్ గా వీక్ చేసే ప్రయత్నం చేసింది. దాంతో అందరూ కావాలి అనుకునే నిఖిల్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు.. నిన్న కోడి గుడ్ల టాస్క్ లో కూడా తాను అనుకున్నది సాధించింది. ఇక అభయ్ బిగ్ బాస్ టాస్క్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నువ్వు బిగ్ బాస్ కాదు భయ బాస్ అంతే.. బయటకు వెళ్ళాక కూడా ఇదే చెప్తాను అని సెటైర్ వేసాడు. అది కాస్త బిగ్ బాస్ కు కోపాన్ని తెప్పించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ గేట్లు ఓపెన్ చేశాడు. దాంతో అందరూ బిగ్ బాస్ కు సారి చెప్పారు. అయినా సరే తన నోటి దురు ఆపుకోలేకపోయాడు అభయ్ తను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. దాంతో డోర్స్ ఓపెన్ అయ్యాయి బయటకు వెళ్లేవాళ్లు వెళ్ళండి అంటూ ఇండైరెక్ట్ గా అభయ్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు ఎపిసోడ్ లో నాగ్ ఎవరికీ క్లాస్ పీకుతాడో చూడాలి..