BigTV English

OTT Movie : డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసిన తమిళ క్రైం థ్రిల్లర్… మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్

OTT Movie : డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసిన తమిళ క్రైం థ్రిల్లర్… మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్

OTT Movie : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకుండా పోతున్నాయి. మిడ్ రేంజ్ నుంచి మొదలుకొని భారీ బడ్జెట్ సినిమాలకే ఎక్కువగా థియేటర్లను కేటాయిస్తున్నారు. ఇక పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే దానికి ముందు, వెనకా వచ్చే సినిమాల రిజల్ట్ దారుణంగా ఉంటుంది. అలాగని సోలోగా రిలీజ్ చేసుకుందాం అంటే డేట్స్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నది అనుమానమే. అందుకే ఓటిటి బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు కొంతమంది మూవీ మేకర్స్. ఇక ఇప్పుడు మనం చెప్పుకో పోయే తమిళ థ్రిల్లర్ మూవీ కూడా అలా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఏమీ చేయకుండానే ఈ శుక్రవారం డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ పేరు ఏంటి? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీని నేరుగా ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఫ్రీగా చూసే ఛాన్స్ మాత్రం లేదు. ఈ తమిళ థ్రిల్లర్ మూవీ రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాలంటే రూ. 99 రూపాయల రెంట్ చెల్లించే చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాకు ధీరవ్ దర్శకత్వం వహించగా, తిరవ్, సత్య, విజయ్ డ్యూక్, విపిత, నిఖిల శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పూర్తిగా చెన్నైలోనే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కేవలం 20 రోజుల్లోనే పూర్తవడం విశేషం. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే డోపమైన్ అనే హార్మోన్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎక్కువైనా, తక్కువైనా తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు నాడీ సంబంధ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇదే పాయింట్ తో డైరెక్టర్ సినిమాను నడిపించారు. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు ఈ మూవీ సింప్లీ సౌత్ అనే ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది.


Dopamine @ 2:22 ( Official Trailer ) Tamil | Dhirav Nikhila Vijay Vibitha | Hashtag FDFS Productions

స్టోరీ లోకి వెళ్తే…

సినిమా మొత్తం ఏడుగురు వ్యక్తుల చుట్టూనే తిరుగుతుంది. వాళ్లందరికీ ఓ హత్యతో సంబంధం ఉంటుంది. నిజానికి ఈ ఏడుగురు వ్యక్తులకు ఒకరితో ఒకరికి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ వాళ్లందరిలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఈ హత్యతో వాళ్లను కలుపుతుంది. ఓ వ్యసనం కారణంగా అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఏడుగురు ఒక చోటకి చేరుతారు. అప్పుడు టైం సరిగ్గా 2:22 గంటలు అవుతుంది. అప్పుడే ఓ హత్య జరుగుతుంది. మరి ఈ ఏడుగురిలో హత్య చేసింది ఎవరు? ఆ హత్యతో వీళ్లకు సంబంధం ఏంటి? వాళ్ళకు ఉన్న వ్యసనం ఏంటి? ఈ హత్య కేసు నుంచి తప్పించుకోగలిగారా? అసలు ఎవరు ఎవరిని ఎందుకు హత్య చేశారు? అనే విషయం తెలియాలంటే డోపమైన్@ 2:22 అనే ఈ సినిమాను చూడాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ వీకెండ్ డోపమైన్ మూవీని డోంట్ మిస్.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×