BigTV English

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master Case :  టాలీవుడ్ లో సంచలనంగా మారింది జానీ మాస్టర్ కేసు.. గతంలో ఎన్నడూ వినని విధంగా ఆయన పై లైంగిక ఆరోపణల కేసు నమోదు అయ్యింది. తన దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న అమ్మాయి తనపై అనేక సార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తూ కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న ఆయన గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని ఉప్పర్ పల్లీ కోర్టులు హాజరు పరిచారు. ఆయనకు సంబందించిన రిమాండ్ రిపోర్ట్ ను కూడా కోర్టుకు అందించారు. ఆ ఆరోపణలు అన్ని నిజమే అని మాస్టర్ ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయనను రిమాండ్ కోసం 14 రోజుల పాటు చంచల్ గూడా జైలులో ఉంచారు. ఇక ఈ కేసులో మరో సంచలన నిజం బయట పడింది. ఈ కేసులో స్టార్ హీరో ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


అవును మీరు విన్నది నిజమే ఈ కేసులో మాస్ హీరో విశ్వక్ సేన్ పేరు బయటకు వచ్చింది. ఈయన సినిమా వల్లే భాధితురాలికి, మాస్టర్ కు గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అసలు నిజా నిజాలెంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అసలు విషయానికొస్తే.. జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎప్పట్లానే విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్ కు కొరియోగ్రఫీ చేయడానికి వచ్చిందంట బాధితురాలు. షెడ్యూల్ ప్రకారం ఆరోజు 30 నుంచి 35 షాట్స్ తీయాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించకపోతే కనీసం 15 షాట్స్ అయినా తీయాలి. కానీ బాధితురాలు మాత్రం తన కొరియోగ్రాఫీలో కేవలం 7 షాట్స్ మాత్రమే తీసిందంట. ఇలాంటి అయితే నష్టం తప్పదని విశ్వక్ తో పాటు, నిర్మాత కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆమెను తీసేసి, మరుసటి రోజు నుంచి మరో మాస్టర్ ను తెచ్చుకున్నారని అప్పటిలో టాక్ నడిచింది.


జానీ మాస్టర్ వల్లే ఆమెను సినిమా నుంచి తప్పించారట..

Vishwak Sen in Johnny Master case? Another twist in the case..
Vishwak Sen in Johnny Master case? Another twist in the case..

సి నిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆమెను అనేకసార్లు రమ్మని ఫోన్లు చేశారని సమాచారం. పనిలో ఉన్నప్పుడు జానీ మాస్టర్, బాధితురాల్ని చాలా ఇబ్బంది పెట్టాడట. దీంతో ఆమె వర్క్ పై ఫోకస్ పెట్టలేక, ఆ రోజు షూటింగ్ చెడగొట్టిందని ఓ వర్గం చెబుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను జానీ మాస్టర్ భార్య సుమలత ఖండిస్తున్నారు ఆమె మాట్లాడుతూ.. ఆ అమ్మాయి వర్క్ నచ్చక విశ్వక్ సినిమా నుంచి పంపించేశారు. వర్క్ నచ్చనప్పుడు లక్షల్లో నష్టం వస్తుంది కదా, అందుకే వెంటనే తీసేసి మరో డాన్స్ మాస్టర్ ను తెచ్చుకున్నారు. అది ఆమె మనసులో పెట్టుకున్నట్టుంది. నిజానికి ఆ ఇష్యూకు జానీ మాస్టర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఏ పాట చేయకపోయినా దానికి జానీ మాస్టర్ ఎలా కారణం అవుతారు. ఇలా ఊహించని విధంగా జానీ మాస్టర్ కేసులో విశ్వక్ సేన్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అతడికి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది.. ఈ కేసులో ఎవరిదీ అసలు తప్పు..? మాస్టర్ నిజంగానే అలాంటి వాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×