BigTV English

Bigg Boss Goutham: ఎర్ర కండువా వెనుక ఇంత అర్థం ఉందా.. లాజిక్కే గురూ..!

Bigg Boss Goutham: ఎర్ర కండువా వెనుక ఇంత అర్థం ఉందా.. లాజిక్కే గురూ..!

గత 105 రోజులుగా ప్రేక్షకులను నిర్విరామంగా ఎంటర్టైన్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss)డిసెంబర్ 15వ తేదీన పూర్తయింది. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ తో సాగిన ఈ సీజన్ లో నిఖిల్(Nikhil) విన్నర్గా నిలవగా.. గౌతమ్ (Goutham) రన్నర్ గా నిలిచారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండీ ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లోకి హాజరు కావాల్సిందే. ఇక అందులో భాగంగానే రన్నర్ గా నిలిచిన గౌతమ్ కూడా.. అర్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరయ్యి, పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానులను ఆకట్టుకోవడానికి గౌతమ్ ఎర్ర కండువా తలకు చుట్టుకుంటున్నాడు అనే విమర్శలకు సమాధానం తెలియజేశారు.


బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని ఎలిమినేట్ అయ్యి… అనూహ్యంగా కన్ఫెషన్ రూమ్ నుండీ అశ్వద్ధామ కం బ్యాక్ అంటూ తనలోని ఆట తీరును మెరుగుపరుచుకుంటూ 13 వారాలపాటు హౌస్ లో ఉన్నాడు. అయితే అక్కడ టైటిల్ గెలవలేకపోయాడు. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టాడు. వచ్చిన రెండవ వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడంతో సేవ్ అయ్యాడు గౌతమ్. అలా ఆ తర్వాత కాలంలో తన ఆట తీరులో మార్పులు తీసుకొచ్చి తన స్ట్రాటజీతో ప్రేక్షకులను మెప్పించి రన్నర్ గా నిలిచారు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అయిన నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ గ్రూపిజం చేస్తున్నారంటూ బయట ప్రేక్షకులు అనుకుంటున్న విషయాలను హౌస్ లో చెబుతూ అందరిని అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు.

ఇకపోతే తాజాగా బజ్ లో పాల్గొన్న గౌతమ్ కృష్ణకు..” ఎర్రకండువా కట్టుకొని పవన్ కళ్యాణ్ మేనరిజం ఇమిటేట్ చేస్తూ ఆయన ఫ్యాన్స్ ని ఓన్ చేసుకొని టైటిల్ గెలవాలనే స్కెచ్ వేశారనే ఆరోపణలు మీ మీద ఉన్నాయి.. దీనికి మీరు వివరణ ఏంటి?”అని అర్జున్ అడగగా.. “నేను పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని, మీరు గత రెండు సంవత్సరాలుగా నా సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే అర్థమవుతుంది. ఎర్ర కండువ అనేది పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షించడానికి నేను కట్టుకోలేదు. ఎర్ర కండువా అనేది కామన్ మ్యాన్ వాయిస్. ప్రతి సామాన్యుడి వాయిస్ నేను ప్రెసెంట్ చేయడం కోసమే. ఈ ఎర్ర కండువా కట్టుకున్నాను” అంటూ గౌతమ్ వివరణ ఇచ్చారు. ఇక గౌతమ్ ఇచ్చిన వివరణ చూసి ఇది లాజిక్కే కదా.. భలే పాయింట్ పట్టేసావ్ అంటూ గౌతమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఇకపోతే సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన గౌతమ్ నేరుగా సీజన్ ప్రారంభంలోనే వచ్చి ఉంటే ఖచ్చితంగా టైటిల్ కొట్టేవాడు కానీ వైల్డ్ కార్డు కావడం వల్లే టైటిల్ కోల్పోయాడు అనేది వాస్తవం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×