Virat Kohli – Akashdeep: గెలుపును నిర్ణయించే ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మూడవ టెస్టులో భారత్ తడబడింది. గత రెండు టెస్ట్ ల మాదిరిగానే భారత ఆటగాళ్లు పేలవ బ్యాటింగ్ తో పాటు చెత్త బౌలింగ్ తో పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేసిన గబ్బా పిచ్ పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా కి తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. మొదటి బంతిని ఫోర్ కొట్టిన యశస్వి జైస్వాల్.. రెండవ బంతికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Also Read: ICC WTC 2025 final: మూడో టెస్ట్ డ్రా అయితే.. WTC నుంచి టీమిండియా తప్పుకోవడమేనా ?
ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన గిల్ కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. ఇక స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కేవలం 9, రోహిత్ శర్మ 10 పరుగులకే అవుట్ అయ్యి జట్టుని కష్టాల్లో పడేశారు. ఇక పదేపదే వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ కేఎల్ రాహుల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. సెంచరీ వైపు పరుగులు తీసిన కేఎల్ రాహుల్ 84 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
అలాగే రవీంద్ర జడేజా కూడా 77 పరుగులు చేసి జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక రాహుల్ – జడేజా అవుట్ కాగానే భారత్ ఫాలో ఆన్ ఆడడం తప్పదని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా – ఆకాష్ దీప్ వారి బ్యాటింగ్ తో టీమ్ ఇండియాని ఆదుకున్నారు. జట్టుని దాదాపు ఓటమి నుంచి గట్టెక్కించారు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఇక బుమ్రా – ఆకాష్ దీప్ చివరి వికెట్ కి 33 పరుగులు జోడించి భారత్ ని ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించారు.
Also Read: Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇది ఫ్రూఫ్?
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమీన్స్ వేసిన 75వ ఓవర్ లో ఆకాష్ దీప్ {Virat Kohli – Akashdeep} ఎలాంటి అదురు బెదురు లేకుండా భారీ సిక్సర్ బాదాడు. 75వ ఓవర్ లో నాలుగో బంతిని కమిన్స్ గుడ్ లెంత్ లో వేయగా.. ఆకాష్ ఫ్రంట్ లెగ్ జరిపి ఓవర్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో కోలాహలం నెలకొంది. ఆ బంతి ఆకాశంలోకి వెళ్లి ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఆ సిక్స్ చూసి విరాట్ కోహ్లీ {Virat Kohli – Akashdeep} ఆశ్చర్యపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు చూస్తూ నోరేళ్లబెట్టాడు. ప్రస్తుతం ఆకాష్ దీప్ సిక్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆచితూచి ఆడుతూ బూమ్రా వికెట్ పడకుండా జాగ్రత్త పడగా.. అతని సహకారంతో ఆకాష్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. దీంతో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్ ని ముగించారు.
Virat Kohli’s reaction on akashdeep Saving Follow-on for team india, and the after hitting six.😂🤍🔥#INDvsAUS pic.twitter.com/RLK598FZEB
— Utkarsh (@toxify_x18) December 17, 2024