Bigg Boss 9 Telugu: స్టార్ మా లో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు విమర్శలు ఎదురవుతున్న ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ సక్సెస్ఫుల్గా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఈ షో. తెలుగులో ఇప్పటికీ ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకునింది. ప్రస్తుతం 9 వ సీజన్ ప్రసారమవుతుంది. ఇందులో ఆరో వారం ఎలిమినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న భరణి ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భరణి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్నది జనాలు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆయన ఆరువారాలకి ఎంత సంపాదించాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర నటుడు భరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సీరియల్స్లలో విలన్ పాత్రలో నటించి జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన తన క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో భరణి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.. హౌస్ లో దాదాపు 6 వారాలు కొనసాగిన ఈయన ఆరో వారం అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు.. హౌస్ లో ఇంకా చాలామంది డేంజర్ జోన్ లో ఉన్నా కూడా ఈయనను బయటకు పంపించడానికి కారణమేంటని ఆడియన్స్ బుర్ర గోక్కుంటున్నారు. ఏది ఏమైనా సరే హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెంట్ బయటికి వెళ్లిపోయారు. అయితే భరణికి ఆరు వారాలకు బాగానే ముట్టచెప్పారు బిగ్ బాస్.. రోజుకి రూ. 50,000, ఒక్కో వారానికి రూ. 3,50,000 రెమ్యునరేషన్ ను అందుకున్నారు. ఈ లెక్కన చూస్తే ఈయన 6 వారాలకు 21 లక్షలు అందుకున్నారు. అందరికన్నా ఎక్కువ ఈయనకే అని చెప్పాలి..
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ కామాక్షి రియల్ లైఫ్.. కుర్రాళ్ల మతిపోగొడుతుంది మావా..
ఆరో వారం నామినేషన్స్ హీటెక్కించాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో పడడం తో వాళ్ల అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే గత వారం డబల్ ఎలిమినేషన్ ఉన్నట్లు.. ఈ వారం త్రిబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ ఓ వార్త ప్రచారం లో ఉండేది. కానీ బిగ్ బాస్ మాత్రం ఈ వారం ఒకరిని ఎలిమినేట్ చేశారు. సీరియల్ నటుడు భరణి హౌస్ నుంచి బయటికి వచ్చేసారు. హౌస్ లో ఇన్ని రోజులు అందరితో కలిసిపోయి ఆయన ఆడిన ఆట తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది. రామ్ రాథోడ్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి ఓటింగ్ తక్కువగా ఉన్నాయి. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. అంతేకాదు వైల్డ్ కార్డు ద్వారా మరో కొత్త సెలబ్రిటీ హౌస్ లోకి అడుగు పెట్టబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు ఎంట్రీ ఇస్తారో..