BigTV English

Bigg Boss 9 : కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి, పోకిరి లెవెల్ ట్విస్ట్ తర్వాత అతనే కెప్టెన్

Bigg Boss 9 : కన్నీళ్లు పెట్టుకున్న సుమన్ శెట్టి, పోకిరి లెవెల్ ట్విస్ట్ తర్వాత అతనే కెప్టెన్

Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆసక్తికరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ గా పది రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నేడు 11వ రోజులోకి ఎంట్రీ ఇచ్చింది. నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ అందరినీ పిలిచి తెలుగులో మాట్లాడమని వార్నింగ్ ఇచ్చారు. తెలుగు రాని వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ హౌస్ కంటెస్టెంట్ లకు చెప్పారు. తెలుగు రాని వాళ్లు కూడా ఈ షోలో మాట్లాడుతారు, కానీ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడటం అనేది నాకు మాత్రమే కాదు ఆడియన్స్ కూడా చిరాకు తెప్పిస్తుంది అని బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ ఒక ఫోన్ టాస్క్ ఇచ్చారు.


బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ప్రకారం ఓనర్స్ టైం ముందుగా జీరో కు చేరినందుకు వాళ్లను అభినందించారు. టెనెంట్స్ టైం ఇంకా మిగిలి ఉన్న కారణంగా వాళ్లు నిద్రపోకుండా ఉండాలని చెప్పారు. మొత్తానికి టెనెంట్స్ కూడా జీరోకి చేరిపోయింది.

సుమన్ శెట్టి ఎమోషనల్ 

భరణి సుమన్ శెట్టి తో మాట్లాడారు. భరణి నీ ఉద్దేశిస్తూ సుమన్ శెట్టి మీరు బాధపడుతున్నారా మా కోసం ఏమీ చేయలేకపోతున్నాము అని, రాము రాథోడ్ నాతో చెప్పాడు అంటూ సుమన్ శెట్టి మాట్లాడారు. సెలబ్రిటీస్ కి హెల్ప్ చేయాల్సింది పోయి వాళ్లకు చేస్తున్నాను అంటూ భరణి అన్న ఏడుస్తున్నాడు అని రాము నాతో చెప్పాడు. నేను కూడా బలమైన వారిని ఇచ్చేశాము అని ఫీల్ అయ్యాను. దీనికి సమాధానంగా నేను జెన్యూన్ గా ఆడుతున్న కూడా వాళ్ళు నన్ను నమ్మట్లేదు అంటూ భరణి సుమన్ శెట్టి తో చెప్పారు. నన్ను సపరేట్ గానే చూస్తున్నారు అంటూ భరణి చెప్పాడు. భరణితో సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు.


అర్హత లేదు 

క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో గెలిచిన ఓనర్స్ గ్రూప్ కి బిగ్ బాస్ అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ గ్రూప్ నుంచి ఇష్టపడని, కెప్టెన్సీ కోసం అర్హత లేదు అని భావించిన వాళ్లను నలుగురిని నిర్ణయించాలి అని బిగ్ బాస్ చెప్పారు. ఆ నలుగురు కెప్టెన్సీ నుంచి తప్పించుకొని మిగతా ముగ్గురు మాత్రమే కెప్టెన్సీ బరిలో ఉంటారు.

 

టెనెంట్స్ అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రియశెట్టి, హరీష్ అనర్హులంటూ సంజన ఓనర్స్ తో చెప్పేశారు. హరీష్ అనర్హులు అని చెప్పడానికి మూడు స్వింగ్స్ అనే ఒక కారణాన్ని సంజన చెప్పారు. దానికి హరీష్ కూడా సైలెంట్ కౌంటర్ వేశారు. అలానే శ్రీజ దమ్ము కూడా కెప్టెన్ గా వద్దు అని గ్రూప్ అంతా డిసైడ్ చేసేసారు.

 

మొత్తానికి ఓనర్స్ నుంచి కెప్టెన్సీ కి పోటీ పడడానికి భరణి, మనీష్, పవన్ ను ఎన్నుకున్నారు టెనెంట్స్. వీళ్ళు ముగ్గురుతో పాటు టెనెంట్స్ లోని బెస్ట్ ప్లేయర్ కెప్టెన్సీ కోసం పోటీ పడటానికి అవకాశం ఇచ్చారు.

కెప్టెన్సి టాస్క్

ఓనర్స్ కి వాళ్లతో పోటీపడే ఒక పర్సన్ ను ఎన్నుకోమన్నప్పుడు అందరూ కలిసి ఇమ్మానుయేల్ ను కెప్టెన్సీ టాస్క్ కోసం ఎన్నుకున్నారు. మొత్తానికి వీళ్ళ నలుగురు మధ్య రంగు పడుద్ది అనే టాస్క్ జరిగింది, ఇలా జరగడం వలన మనీష్ మొదట ఎలిమినేట్ అయిపోయారు. నీ దాంట్లో నుంచి ఒకరు పోయారు అని ప్రీతి చౌదరి చెప్పారు. ఈ మాటతో ఓనర్స్ ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము రెచ్చిపోయారు. మొత్తానికి రీతు భరణిని ఎలిమినేట్ చేయడం వలన వీళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయిపోయారు. మొత్తానికి టాస్కులు అన్ని పూర్తి అయిన తర్వాత డిమాన్ పవన్ కెప్టెన్ గా గెలుపొందారు.

Also Read : OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే

Related News

Bigg Boss 9 Telugu: ఎన్టీఆర్ తో బిగ్ బాస్ ఫైర్ మ్యాన్… ఇంత మోసం చేస్తారనుకోలేదు..?

Bigg Boss Telugu 9: రెండోవారం హౌజ్‌ కెప్టెన్‌ అతడే.. కామనర్స్ నుంచి తొలి కంటెస్టెంట్ గా..

Bigg Boss 9: 2వ వారం ఓటింగ్ లిస్ట్ వైరల్.. టాప్ లో సుమన్ శెట్టి.. లీస్ట్ ఎవరంటే?

Bigg Boss 9 Promo : రంగుపడుద్ది టాస్క్, మొత్తానికి కామనర్స్, ఓనర్స్ అనే రంగులు బయటపడ్డాయి 

Bigg Boss 9: కెప్టెన్సీ వార్… ఆ లవ్లీ జంట మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్

Bigg Boss 9: కెప్టెన్సీ కోసం మళ్లీ యుద్ధం.. ఈవారం గెలిచేదెవరు?

Bigg Boss 9 : పులిహోర పంచాయతీలు, ఎంగిలి చాక్లెట్లు, కెప్టెన్సీ కోసం కాలచక్ర ఛాలెంజ

Big Stories

×