Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్ 19వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే క్రుంగిపోకండి. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్‌ను మార్చుకోండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. లక్కీ సంఖ్య: 6
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కరలేదు. మీ చుట్టూరా ఉన్న వారే మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. కమిషన్ల నుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీల ద్వారా లబ్దిని పొందుతారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. సంఘంలో పెద్ద వ్యక్తులను కలుస్తారు. లక్కీ సంఖ్య: 5
క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచిరోజు. ఆరోగ్యం కొసం బయట ఎక్కువ దూరం నడవండి. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. లక్కీ సంఖ్య: 3
పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందకండి. టెన్షన్ పడటం వల్ల మీ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది. ఏదైనా విషయంలో కమిట్ అయ్యే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. లక్కీ సంఖ్య: 6
మీ ప్రెండ్స్ మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షిస్తారు. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. వృథా ఖర్చులు చేస్తారు. ఆ ఖర్చులను ఆపాలని ప్రయత్నించినా మీ జాతకం ప్రకారం డబ్బులు ఖర్చు అవుతాయి. లక్కీ సంఖ్య: 5
మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. మీ సహుద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీవస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది. లక్కీ సంఖ్య: 3
చిన్న విషయాలకే చీకాకు పడకండి. మీ అమ్మా నాన్నల నుంచి పొదుపు ఎలా చేయాలో తెలుసుకుంటారు. ఇప్పుడు పొదుపు చేయకపోతే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. బంధువుల నుంచి గిఫ్ట్ అందుకుంటారు. ఉద్యోగులకు ఆఫీసులో ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. లక్కీ సంఖ్య: 5
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ స్నేహితుడు మిమ్ములను పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా అడిగే అవకాశం ఉంది. మీరు వారికి సహాయము చేస్తే మీరు ఆర్ధికంగా నిర్వీర్యం అవుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. లక్కీ సంఖ్య: 7
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మీ దగ్గరి వ్యక్తులే మీ మీద కోపం తెచ్చుకుంటారు. లీగల్ విషయాల్లో ముందడుగు వేయడానికి ఇవాళ మంచి రోజు. మీ శ్రీమతికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. లక్కీ సంఖ్య: 4
స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంత వరకు టెన్షన్లకు కారణమవుతారు. లక్కీ సంఖ్య: 4
వత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో కొంతసేపు గడపండి. మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి. లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియ చేయటం ఉత్తమం. లక్కీ సంఖ్య: 2
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్ధిక లాభాన్ని చేకూరుస్తుంది. స్నేహితులు, బంధువులు, మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. లక్కీ సంఖ్య: 9