OG Tickets : ఎన్నో ఏళ్ల ఆకలికి పొద్దు పొడిచింది అయ్యో ఇయ్యాలే అన్నట్లు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరో వారం రోజుల్లో సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా విడుదల కానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలు అన్నిటిని కూడా ఈ సినిమా నిలబెడుతుంది అని అంచనా వేస్తున్నారు.
స్వతహాగా సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి కొంతమేరకు ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా సినిమా మీద ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఇక ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్లో రాత్రి 1:00 షోస్ కి పర్మిషన్స్ ఇచ్చారు. అలానే జీఎస్టీ తో కలిపి ఈ సినిమా టికెట్ రేట్ ను ₹1000 అంటూ ఫిక్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ యాప్ లో ప్రస్తుతం ఓ జి సినిమాకి సంబంధించిన టికెట్స్ ఓపెన్ అయిపోయాయి. గుంటూరు ప్రాంతంలో రాత్రి 1:00 సినిమా టికెట్స్ ఓపెన్ చేశారు. టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన మరుక్షణం లోనే అన్ని బుకింగ్ అయిపోయాయి. అతి త్వరలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కంప్లీట్ గా ఓపెన్ చేయనున్నారు. ఈ సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి మంచి సక్సెస్ సాధిస్తే , కొత్త రికార్డ్స్ ను చూడటం ఖాయం.
సుజీత్ (Saahoo Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడే, చాలామంది సుజిత్ టాలెంట్ ను బయటికి తీసి సాహో సినిమాను పొగడడం మొదలుపెట్టారు. అయితే అప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా సాహో సినిమా రిలీజ్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత సక్సెస్ అయింది అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు.
ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి స్టార్ కాస్ట్ చూస్తుంటే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఈ సినిమాలో ఓమి అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ఈయనకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలై మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అలానే ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈ సినిమాలో ఉన్నాడు అనే వార్త నేడు బయటకు వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఏదేమైనా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన అసలైన వైబ్ చూస్తున్నాం. సినిమా హిట్ అయితే అదే హ్యాపీ.
Also Read: Bigg Boss 9: రంగుపడుద్ది టాస్క్, మొత్తానికి కామనర్స్, ఓనర్స్ అనే రంగులు బయటపడ్డాయి