BigTV English

Bigg Boss 9 Telugu : ట్విస్ట్ అదిరింది.. బిగ్ బాస్ కే కండిషన్స్ పెట్టిన నాగార్జున..!

Bigg Boss 9 Telugu : ట్విస్ట్  అదిరింది.. బిగ్ బాస్ కే కండిషన్స్ పెట్టిన నాగార్జున..!
Advertisement

Bigg Boss 9 Telugu : బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడు అని ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేస్తుంది.. ఇవాళ ఈ షో గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. ఈ షో కి సంబంధించిన ప్రోమో ని కొద్దిసేపటి క్రితమే బిగ్ బాస్ మేకర్స్ రిలీజ్ చేశారు.. అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. హౌస్ లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలు ఎవరు? అగ్నిపరీక్ష ద్వారా అడుగుపెట్టే సామాన్యులు ఎవరు అనే దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే లీకైన పేర్లు ఇప్పుడు హౌస్ లో కనిపిస్తున్నాయి.. ఆ లిస్టు ప్రకారం చూస్తే.. భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ గౌడ, రీతూ చౌదరి, ఆశా షైనీ, సంజన గల్రాని వంటి వారు ఉన్నారు. అదే విధంగా సామాన్యుల నుండి ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి తో పాటుగా మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు.. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కొత్తగా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది..


బిగ్ బాస్ కే నాగార్జున కండిషన్స్..?

హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నాగార్జున ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌజ్‌తో.. డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది నాగార్జున వాయిస్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఇక ఎప్పట్లాగా హౌస్ నీ ముందుగా రివిల్ చెయ్యకుండా సస్పెన్స్ గా ఉంచారు. కళ్లకు గంతలు కట్టుకుని బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టాడు నాగార్జున. ఇప్పటివరకు నాలో యుద్ధభూమిలో శంఖం పూరించిన కృష్ణుడును చూశారు. ఇప్పుడు రంగంలోకి దిగే అర్జునున్ని చూస్తారని బిగ్ బాస్ అంటాడు. నేను దేనికైనా సిద్ధమే అని నాగార్జున కళ్లకున్న గంతలు తీసి హౌజ్ మొత్తం చూస్తాడు.. బిగ్ బాస్ లో ఈసారి రెండు టీములుగా రెండు హౌస్ల్లో కంటెస్టెంట్లు ఉంటారని తెలుస్తుంది.. మరి అస్సలు తగ్గకుండా ఈ షో ఉండబోతుందని ప్రోమో అని చూస్తే అర్థమవుతుంది.

Also Read : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?


మొదటిరోజే అవుట్.. 

గతంలో వచ్చిన బిగ్ బాస్ ను చూస్తే ఇప్పుడు ప్రసారమవుతున్న బిగ్ బాస్ కి చాలా తేడాలున్నాయిని ప్రోమో ని చూస్తే తెలుస్తుంది.. కేవలం ప్రోమో వీడియోతోనే ఆసక్తిని పెంచేసిన బిగ్ బాస్ ఇవాళ ఎపిసోడ్కి ఎలాంటి ట్విస్టులను ఇస్తారు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే హౌస్ లోకి ఎప్పుడైనా కంటెస్టెంట్లు వచ్చిన వారంలో ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఈ సీజన్ మాత్రం మొదటి రోజే మొదటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు ప్రోమోలో తెలుస్తుంది.బాక్స్‌ను తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉందా” అని నాగార్జున అడుగుతాడు. “బిగ్ బాస్ ఇది నా బాడీలో ఓ భాగం. దయచేసి లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వండి అని బిగ్ బాస్‌తో చెప్పుకుంటాడు ఆ కంటెస్టెంట్. ఏం మీతో తెచ్చుకోడానికి వీళ్లేదు అని బిగ్ బాస్ చెబుతాడు. దీన్ని నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతానని సెల్ఫ్ ఎలిమినేట్ అవుతాడు అతను. కంటెస్టెంట్ చెప్పినదానికి అది మీ ఇష్టం అని బిగ్ బాస్ అంటాడు. దాంతో నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ, బిగ్ బాస్ హౌజ్‌లోకి కాదు అని నాగార్జున చెబుతాడు.. ఇది మాత్రం ఊహించని పరిణామం అని చెప్పాలి. మరి ఇవాల్టి ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..

Related News

Bigg Boss 9: లాస్ట్ మినిట్ లో తారుమారు.. పచ్చళ్ల పాపపై కోపం.. ఆమె సేఫ్!

Bigg Boss 9: రోజురోజుకి ఆసక్తి తగ్గుతుంది, ఇలా అయితే కష్టమే బిగ్ బాస్ కొత్తగా ప్లాన్ చేయాల్సిందే

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లో ఇమ్మానుయేల్ మించిన బెస్ట్ పర్సన్ ఇతనే

Ramu Rathod Elimination : షాకింగ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ ఔట్, ఏంటి బిగ్ బాస్ ఇది?

Bigg Boss 9 Promo: హౌస్ లోకి పోలీసులు.. అసలేం జరుగుతోంది?

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!

Bigg Boss 9 Telugu : కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..

Big Stories

×