Canada vs Scotland: క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, లేదా వరుసగా వికెట్లు తీయడం, అదిరిపోయే ఫీల్డింగ్ చేయడం లాంటి సంఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా.. గతంలో ఎన్నడూ జరగని సంఘటన జరిగింది. తొలి రెండు బంతులకే… ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అయ్యారు. ఒకరు క్యాచ్ అవుట్ కాగా.. మరొకరు రన్ అవుట్ కావడంతో ఈ సంఘటన జరిగింది. కెనడా వర్సెస్ స్కాట్లాండ్ (Canada vs Scotland) మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన కెనడా… మొదటి రెండు బంతులలోనే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా జరగడం 148 సంవత్సరాల తర్వాత అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
కెనడా వర్సెస్ స్కాట్లాండ్ ( Canada vs Scotland ) మధ్య జరిగిన తాజా మ్యాచ్లో… తొలి రెండు బంతులకే కెనడా రెండు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ తొలి బంతికే కెనడా ఓపెనర్ అలీ నదీమ్ ( Ali Nadeem )… బ్రాడ్ కర్రీ బౌలింగ్లో స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా ( Yuvraj Samra ) రెండో బంతికి రన్ అవుట్ అయ్యాడు. స్ట్రైకర్ లో ఉన్న ఆటగాడు స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టడంతో… ఆ బంతి బౌలర్ చేతికి తాకి… నాన్ స్ట్రైక్ వైపు ఉన్న వికెట్లను పడగొట్టింది. ఆ సమయంలో యువరాజు ( Yuvraj Samra ) గ్రీజు లో లేకపోవడంతో… బ్రాడ్ చేతిలోనే రన్ అవుట్ అయ్యాడు. దీంతో ఈ సంఘటన.. ఇప్పుడు వైరల్ గా మారింది దీనికి సంబంధించిన వీడియో కూడా… హాట్ టాపిక్ అయింది.
అరుదైన సంఘటన జరిగిన స్కాట్లాండ్ వర్సెస్ కెనడా మ్యాచ్ లో అనూహ్యంగా స్కాట్లాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెనడా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే 48.1 ఓవర్లలో… 184 పరుగులకు ఆల్ అవుట్ అయింది కెనడా ( Canada). ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ ( Scotland Team ) బౌలర్ బ్రాండ్ 10 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 41.5 ఓవర్ల లోనే లక్ష్యాన్ని చేదించింది. కేవలం మూడు వికెట్లు నష్ట పోయి 187 పరుగులు చేసింది స్కాట్లాండ్. జార్జ్ 84 పరుగులు చేయగా రిచి 64 పరుగులతో దుమ్ము లేపాడు. దీంతో స్కాట్లాండ్ విజయం సాధించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడా తో గ్రాండ్ విక్టరీ కొట్టింది స్కాట్లాండ్.
Also Read : Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే