BigTV English

Bigg Boss Sonia : నాగార్జున నన్ను మోసం చేశాడు .. బయటకొచ్చిన సోనియా రియాక్షన్..

Bigg Boss Sonia : నాగార్జున నన్ను మోసం చేశాడు .. బయటకొచ్చిన సోనియా రియాక్షన్..

Bigg Boss Sonia : బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ షో గురించి బిగ్ బాస్ బజ్ లో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తారన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం సీజన్ 8 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు రోజుల్లో ఐదో వారం కూడా పూర్తి కాబోతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రడీ హీరో ఆదిత్య ఓం ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక నైనిక వీకెండ్ బయటకు వెళ్తుందని లీకయింది. అలాగే బిగ్ బాస్ 2.ఓ స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగో వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సోనియా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన సోనియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే.. ఆ ఇంటర్వ్యూ లో ఆమె బిగ్ బా స్ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది. ప్రస్తుతం అవి దుమారం రేపుతున్నాయి. రియాలిటీ షో అంటే జీవితానికి సరిపడా అనుభవాలను నేర్చుకోవచ్చు అనుకున్నాను. కానీ బిగ్‌బాస్‌ నన్ను రోడ్డున పడేశాడు. నన్ను కావాలని బ్యాడ్‌ చేశాడు. నేను విష్ణుప్రియను టార్గెట్‌ చేశానంటున్నారు కానీ విష్ణుయే నన్ను టార్గెట్‌ చేసింది. నిఖిల్‌ విషయానికి వస్తే అతడు డిప్రెషన్‌లో ఉన్నాడు. నన్ను ఫ్యామిలీ అని భావించాడు.. నిఖిల్ నా పెళ్లికి చైన్, పృథ్వి ఇయర్ రింగ్స్ ఇస్తానని చెప్పారు.. కానీ ఇక్కడ చూపించింది మాత్రం వేరే ఉంది.

అయితే నా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్‌ చేసి చూపించడం తప్పు కదా.. నేను హౌస్‌లో ఏ తప్పూ చేయలేదు, బిగ్‌బాసే తప్పుగా చూపించాడు. సాధారణంగా బయట గైడెన్స్‌ ఎలా ఇస్తానో హౌస్‌లో కూడా అలాగే ఇచ్చాను. అందులో తప్పేముంది? నా సలహాలు తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్లిష్టం. బిగ్‌బాస్‌ హౌస్‌లో నేను నాలాగే ఉన్నాను. ఎక్కడ నటించలేదు.. నాకు అక్కడకు వెళ్లిన తర్వాత ఆ ఆలోచన కూడా రాలేదు అని చెప్పింది. గేమ్‌ గురించే మాట్లాడానే తప్ప ఎవరినీ పర్సనల్‌గా టార్గెట్‌ చేయలేదు. గేమ్‌లో నిఖిల్‌, పృథ్వీని మాత్రమే చూస్తే ఎలా? నన్ను కూడా చూడు అని యష్మితో అన్నాను.. దాన్ని కూడా తప్పుగా చూపించారు. ఇక పెళ్ళైన వ్యక్తితో లింక్ పెట్టారు.. బిగ్ బాస్ నాగార్జున నన్ను మోసం చేశారు. ఈ షో కు వెళ్లి తప్పు చేసానని సోనియా తెగ ఫీల్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఆదిత్య ఓం ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆయన ఎలాంటి విషయాలను బయట పెడతాడో చూడాలి..


Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×