BB Telugu 8.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 8వ సీజన్ కూడా చివరి దశకు చేరుకోబోతోంది. ఇకపోతే రేపటితో 11 వారాలు పూర్తికానున్నాయి. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత 6వ వారం 8మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చి, అసలు ఆట మొదలుపెట్టారు.అలా 10వారాలకు గానూ దాదాపు 10మంది ఎలిమినేట్ అవ్వగా.. ఇద్దరు సెల్ఫ్ నామినేట్ చేసుకొని వెళ్లిపోయారు. అందులో మణికంఠ , గంగవ్వ.. ఆరోగ్యం సహకరించక సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని వెళ్లిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 22 మందిలో ప్రస్తుతం పదిమంది టైటిల్ కోసం పోరాడుతున్నారు.
కంటెస్టెంట్స్ లో జోష్ నింపిన ఫ్యామిలీ వీక్..
ఇదిలా ఉండగా 11వ వారం ఫ్యామిలీ వీక్ నడించింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి సంబంధించిన తల్లిదండ్రులు, భర్తలు , భార్యలు హౌస్ లోకి అడుగుపెట్టి , తమ వారు టైటిల్ కోసం ఎలా పోటీపడాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అంతేకాదు ఎవరికి వారు టైటిల్ కొట్టాలని కోరుకున్న విషయం తెలిసిందే. ఈ 11వ వారం ఎమోషనల్ గా , ఫ్యామిలీ సెంటిమెంట్ తో సాగింది. ఫైనల్ గా తల్లిని హౌస్ లోకి తీసుకురావాలని ఎంతో పరితపించి పోయిన టేస్టీ తేజ కూడా తన కళ నెరవేర్చుకున్నారు. తన తల్లి తో కుడికాలు పెట్టించి మరీ హౌస్ లోకి తీసుకొచ్చిన టేస్టీ తేజ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అంతేకాదు టేస్టీ తేజ తల్లి హౌస్ లోకి రావడంతో ఈ వారం ఫ్యామిలీ వీక్ కి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటూ నబీల్ తెలిపారు.
11వ వారం ఎలిమినేట్ అయిన అవినాష్..
ఇకపోతే శని, ఆదివారాలు వీకెండ్స్ లో భాగంగా నాగార్జున కంటెస్టెంట్స్ తో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈవారం గౌతమ్, యష్మీ, పృథ్వీ ,టేస్టీ తేజ, విష్ణు ప్రియ, అవినాష్ ఇలా మొత్తం 6 మంది నామినేషన్ లిస్ట్ లోకి వచ్చేసారు. ఇక నిన్నటితో పోలింగ్ ముగిసింది. మొదటి స్థానంలో గౌతమ్ నిలవగా.. ఆ తర్వాత స్థానంలో టేస్టీ తేజ, యష్మీ ,విష్ణు ప్రియ, పృథ్వీ నిలిచారు. ఇక డేంజర్ జోన్ లో అవినాష్ ఉండగా.. ఈవారం ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఫిక్స్ అయ్యారు. అందరూ అనుకున్నట్టుగానే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు.
ఊహించని ట్విస్ట్.. ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించిన నబీల్..
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది. దీనిని ఉపయోగించి ఒక ఎలిమినేషన్ సేవ్ చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ వీక్ సందర్భంగా నబీల్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ ను ఉపయోగించి అవినాష్ ను సేవ్ చేస్తాడు. అలా ఈవారం ఎలిమినేషన్స్ నుంచి అవినాష్ తప్పించుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఈవారం ఎలిమినేషన్ రద్దు చేయడంతో వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.