BigTV English

Nayanthara: ధనుష్ పరువు బజారుకీడ్చడమే నయన్ ప్లానా.. ?

Nayanthara: ధనుష్ పరువు బజారుకీడ్చడమే నయన్ ప్లానా.. ?

Nayanthara: వివాదాలు.. వివాదాలు.. వివాదాలు.. అసలు వివాదాలు లేకుండా ఉండడం లేడీ సూపర్ స్టార్ నయనతారకు అస్సలు చేతకాదేమో  అనిపిస్తుంది. కెరీర్ మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు.. ఒకటా.. రెండా..  వివాదాల మధ్యలో ఆమె జీవిస్తుందో.. ? ఆమె జీవితంలో వివాదాలు ఉన్నాయో అర్ధం కావడం లేదు. ఆమె ప్రేమ ఒక వివాదం.. పెళ్లి ఒక వివాదం.. పిల్లలు ఒక వివాదం.. కెరీర్ ఒక వివాదం.. సినిమా ప్రమోషన్స్ సైతం వివాదమే. ఇక ఇప్పుడిప్పుడే ఈ వివాదాలకు దూరంగా ఉంటుందేమో అనుకుంటే.. వాటిని మాత్రం వదిలేలా కనిపించడం లేదు నయన్. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై ఈ చిన్నది సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు వీరిద్దరి మధ్య వివాదం ఏంటి.. ? ఎందుకు నయన్.. ధనుష్ ను బజారుకీడ్చింది.. ?  అనేది చూద్దాం.


నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్‌ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. తన కెరీర్ ఎలా సాగింది.. ? ఆమె ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంది.. ? స్టార్ హీరోయిన్ గా ఎలా మారింది.. ? అనేది ఒక డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించింది. ఇకఇందుకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. అక్కడే  పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ ట్రైలర్ లో నేను రౌడీనే  అనే సినిమాకు సంబంధించిన క్లిప్స్ కనిపించాయి. విజయ్ సేతుపతి, నయన్ కలిసి నటించిన ఈ సినిమాకు నయన్ భర్త విగ్నేష్ దర్శకత్వం వహించగా..  ధనుష్ నిర్మించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Mahavatar Narsimha: కెజిఎఫ్ మేకర్స్ నుంచి మరో సంచలనం.. నరసింహా స్వామి రూపంలో ప్రభాస్.. ?


సాధారణంగా ఒక సినిమాలోని క్లిప్స్ ను వాడాలంటే.. కచ్చితంగా ఆ సినిమా మేకర్స్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. లేకపోతే కాపీ రైట్స్ కేసు పడుతుంది. ఈ విషయం అందరికీ తెల్సిందే. నయన్ విషయంలో అదే జరిగింది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్‌ ట్రైలర్ లో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే సినిమాకు సంబంధించి 3 సెకండ్స్ క్లిప్స్ ను వాడారు. ఇక తమ అనుమతి లేకుండా సినిమా నుంచి క్లిప్స్ వాడారని ధనుష్.. నయన్ కు లీగల్ నోటీసులు పంపాడు. అది కూడా 3 సెకండ్స్ క్లిప్స్ వాడినందుకు రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.  ఈ  డాక్యుమెంటరీని   మొదలుపెట్టి రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఈ సమస్య నడుస్తుందని తెలుస్తోంది.

ఇక ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారింది.  రాజీ కుదరకపోవడంతో నయన్.. ధనుష్ ను బజారుకు లాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా నో అబ్జెక్షన్ కోసం తిరుగుతున్నా.. ధనుష్ ఇవ్వలేదని.. అతడు ఇంత దిగజారతాడు అనుకోలేదని తెలుపుతూ మూడు పేజీల బహిరంగ లేఖను రాసుకొచ్చింది. ” రెండేళ్లుగా మీ చుట్టూ తిరుగుతున్నా.. నాపై పగ పెంచుకొని నువ్వు ఇవ్వడంలేదు. నేను రౌడీనే సినిమాకు సంబంధించిన  క్లిప్స్.. నా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. అందుకే  మా మొబైల్స్ లో షూట్ చేసుకున్న క్లిప్స్ ఉంటే వాడుకున్నాం. కానీ, నువ్వు వాటికి కూడా రూ. 10 కోట్లు అడుగుతున్నావు.. నీ క్యారెక్టర్ ఏంటి అనేది ఇక్కడే అర్ధమవుతుంది” అంటూ ఘాటు ఆరోపణలు చేసింది.

Maharaja: చైనాలో రిలీజ్ కానున్న మహారాజా..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ధనుష్ వర్సెస్ నయన్ అని పెద్ద చర్చనే జరుగుతుంది. నయన్ కు స్టార్స్ సైతం మద్దతు  పలుకుతుండగా.. నెటిజన్స్, ఫ్యాన్స్ మాత్రం ధనుష్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ధనుష్ పరువు తీయడానికే నయన్ ఈ పని చేసిందని, యూట్యూబ్ లో ఇలాంటి క్లిప్స్ వేసుకుంటే పర్లేదు కానీ,  డాక్యుమెంటరీ పేరుతో.. నెట్ ఫ్లిక్స్ నుంచి రూ. 40 కోట్లు తీసుకుంటూ.. ఏదో సొంతంగా కష్టపడి చేస్తున్నట్లు ఎలా ఇలా మాట్లాడుతుంది. ఏది ఏమైనా ఎన్ని గొడవలు అయినా.. ఒక స్టార్ హీరోను  బహిరంగంగా ఇలా మాట్లాడం పద్దతి కాదని చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకోపక్క ధనుష్ లాయర్.. లీగల్ గానే మేము ఈ పోరాటాన్ని సాగిస్తామని చెప్పుకొచ్చాడు.

నిజం చెప్పాలంటే  రెండు రోజుల్లో డాక్యుమెంటరీ రిలీజ్ పెట్టుకొని.. ఈ గొడవలకు పోతే నయన్ కే నష్టమని చెప్పాలి. ఒకవేళ ధనుష్ కనుక NOC  ఇవ్వకపోతే.. నిర్మొహమాటంగా  నెట్ ఫ్లిక్స్.. నయన్ దగ్గరనుంచి ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగి తీసుకుంటుంది అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సరే.. పోనీ యూట్యూబ్ రిలీజ్ చేయాల్సి వచ్చినా  కూడా.. కాపీ రైట్ పడకమానదు. మరి ఈ వివాదం ఎక్కడకు వెళ్లి ఆగుతుందో.. ? ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కు వస్తుందో.. ? లేదో.. ? అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×