BigTV English

Vishnu Priya: హౌస్ లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన విష్ణుప్రియ.. వీడియో వైరల్

Vishnu Priya: హౌస్ లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన విష్ణుప్రియ.. వీడియో వైరల్

Vishnu Priya: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ లోపలి వెళ్ళాకా.. ఫన్  ఎక్కువ ఉండడంతో ప్రేక్షకులు బిగ్ బాస్ 8 ను చూడడం మొదలుపెట్టారు. మొదట 14 మంది కంటెస్టెంట్స్  లో ప్రేక్షకులందరికీ తెల్సిన ఒకే ఒక స్టార్ విష్ణు ప్రియ.  పోవే పోరా  అనే షో  ద్వారా కెరీర్ ను ప్రారంభించిన ఈ చిన్నది.. యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలా ఒక పక్క యాంకర్ గా.. ఇంకోపక్క  నటిగా మంచి పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.


ఇక ఆ గుర్తింపుతోనే సీజన్ 8 లకి అడుగుపెట్టింది. ఇక విష్ణు హౌస్ లో ఉంది అంటే రచ్చ రంబోలానే అనుకున్నారు అందరూ.. కానీ,  వెళ్లిన మొదటి రోజు నుంచే అమ్మడు నోరు పారేసుకోవడం.. నాగార్జునతో తిట్లు తినడమే సరిపోయింది.  ఇక ఏమైనా చీఫ్ అవుతుందేమో  అని చూస్తే..  లక్కీ నెంబర్ 6 .. ఆ వారంలో అవుతా.. ఈ వారంలో అవునా అంటూ సోది చెప్పుకొచ్చింది. ఇక వెళ్లిన దగ్గరనుంచి పృథ్వీ తో పులిహార కలపడం తప్ప  విష్ణు చేసింది ఏం లేదు.

అసలు ఈ పాప.. బిగ్ బాస్ కు వెళ్లిందో.. పెళ్లి కొడుకును సెట్ చేసుకోవడానికి పోయిందో అర్ధమే కావడం లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చాకా.. మొదటి నామినేషన్ లో అందరు విష్ణు మీదకే దూకారు. సరే ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా విష్ణులో ఉన్న మరో యాంగిల్ బయటపడింది. ఆమె  దాచుకున్న సీక్రెట్ ఇప్పుడు  బయటపడింది. బిగ్ బాస్ హౌస్ లో విష్ణు  ప్రియ సిగరెట్ తాగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


సోనియా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చింది. నిఖిల్ సిగరెట్ తాగుతున్నాడు అని అంటున్నారు.. కానీ, అమ్మాయిలు కూడా అక్కడ సిగరెట్ తాగుతున్నారు. కానీ, దానిని బిగ్ బాస్ చూపించడం లేదు. ఆ అమ్మాయిలు ఎవరో నేను చెప్పను. ఆ అలవాటు మంచిది కాదు అని ఆమెకు నచ్చజెప్పి మాన్పించాలని చూసాను.  ఒత్తిడి తట్టుకోలేక ఆమె సిగరెట్ తాగుతూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోవడంతో సోనియా చెప్పింది విష్ణు  గురించే అని తెలుస్తోంది.

ఇక ఈ వీడియో చూసిన వారు అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పేంటి అని కూడా చెప్పుకొస్తున్నారు. తప్పేమి కాదు కానీ.. ఆమె సీక్రెట్ గా  చేస్తున్న ఆ పని..  అందరూ చూస్తున్న టీవీలో కనిపిస్తే.. ఆమెపై నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది కదా అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో యష్మీ తరువాత విష్ణునే ఉంది.. ఈ వారం టాస్క్ లో కనుక విష్ణు మంచిగా ఆడకపోతే కచ్చితంగా  ఆమె ఎలిమినేట్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకోపక్క విష్ణు  హౌస్ లో ఉంటే.. ఫుల్ ఎంటర్టైన్మెంట్.. రఫ్ ఆడించేస్తుంది అన్నవారికి  నిరాశే మిగిలిందని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×