BigTV English

Samantha: చిన్మయి కూతురితో సమంత.. క్యూట్ వీడియో వైరల్

Samantha: చిన్మయి కూతురితో సమంత.. క్యూట్ వీడియో వైరల్

Samantha: సినీ పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు ఫ్రెండ్స్ అనేవారు కామన్. కానీ వారిలో కొందరినే ఫ్యామిలీలాగా దగ్గర తీసుకుంటారు సెలబ్రిటీలు. అలాగే సీనియర్ హీరోయిన్ సమంతకు, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అయిన చిన్మయికి చాలా ఏళ్ల నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. చిన్మయికి మాత్రమే కాదు.. తన భర్త రాహుల్‌కు కూడా సమంత చాలా క్లోజ్ ఫ్రెండ్. సమంత ఏ సమస్యలో ఉంది అని తెలిసినా.. చిన్మయి వెంటనే దానికి ఓపెన్‌గా స్పందిస్తుంది. అలా వీరి బాండింగ్ గురించి చాలామందికి తెలుసు. తాజాగా ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన సమంత.. చిన్మయి ఇంటికి వెళ్లింది. నవరాత్రి వేడుకల్లో పాల్గొంది.


ఇద్దరూ ఫ్రెండ్సే

సమంత హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు నుండి చాలావరకు సినిమాల్లో తనకు డబ్బింగ్ చెప్పింది చిన్మయి. చిన్నయి వాయిస్ తోడయితే సమంత యాక్టింగ్ వేరే లెవెల్‌కు వెళ్తుంది అని ప్రేక్షకులు అనుకుంటూ ఉండేవారు. అంతే కాకుండా ముందుగా తమిళంలోనే హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సామ్. అలా తెలుగులో అడుగుపెట్టే ముందు అక్కడే ఒకట్రెండు చిన్న సినిమాల్లో నటించింది. అందులో ఒకటి ‘మస్కౌన్ కావేరీ’. అందులో సమంత హీరోయిన్ కాగా.. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ హీరో. అలా సమంత.. చిన్మయి ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా కలిసిపోయింది. తాజాగా హైదరాబాద్ వచ్చిన సామ్.. చిన్మయి ఇంటికి వెళ్లి తన కూతురితో ఆడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?

పూజ కోసం

నవరాత్రి సందర్భంగా తన ఇంట్లో స్పెషల్ పూజలు చేస్తోంది చిన్మయి. ఆలియా భట్ హీరోయిన్‌గా నటించిన ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వ్యవహరించడం కోసం హైదరాబాద్‌కు వచ్చిన సమంత.. ఆ పూజలో పాల్గొనడానికి వెళ్లింది. చిన్మయితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే ఫోటోలను రీ షేర్ చేస్తూ.. దిష్టి తగలకూడదు అని క్యాప్షన్ కూడా యాడ్ చేసింది చిన్మయి. అంతే కాకుండా చిన్మయి కూతురితో ఆడుకున్న వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఈ వీడియోలో పాపతో పాటు సమంత కూడా చాలా క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

సినిమాలు తగ్గిపోయాయి

ఒకప్పటిలాగా వెంటవెంటనే సినిమాలకు సైన్ చేయడం లేదు సమంత. ఎక్కువగా తన ఆరోగ్యంపైనే ఫోకస్ పెట్టింది. అందుకే ఎప్పుడో ఒకసారి తెరపై కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’లో హీరోయిన్‌గా కనిపించింది. ఆ తర్వాత తను ఎక్కువగా హైదరాబాద్ కూడా రాలేదు. చెన్నైలోనే ఉంటూ అక్కడే బిజీ జీవితాన్ని గడిపేస్తోంది. తాజాగా కొండా సురేఖ కాంట్రవర్సీ తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చింది సామ్. ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్, ఆలియా భట్.. తనపై ప్రశంసలు కురిపిస్తుంటే ఎమోషనల్ కూడా అయ్యింది. త్వరలోనే సామ్ నటించిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×