BigTV English

Bigg Boss 9 Promo: అమాయకుడు కాస్త అపరిచితుడు అయ్యాడు, తనుజను లోపలికి పిలిచిన సుమన్ శెట్టి

Bigg Boss 9 Promo: అమాయకుడు కాస్త అపరిచితుడు అయ్యాడు, తనుజను లోపలికి పిలిచిన సుమన్ శెట్టి

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. అలానే హౌస్మేట్స్ లోని కొత్త రంగులను కూడా బయటకు తీస్తుంది. అమాయకంగా ఉన్న వాళ్ళతో అల్లరి చేయిస్తుంది. బిగ్బాస్ పెట్టిన టాస్కులు కొన్ని చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తున్నాయి.


బిగ్ బాస్ లో ఉన్న హౌస్ మేట్స్ లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి. వ్యక్తిగతంగా కూడా సుమన్ శెట్టి కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. తను గేమ్ ఆడటం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఆయన మీద అందరికీ పాజిటివ్ ఫీలింగ్స్ కలుగుతూనే ఉన్నాయి. అవసరం మేరకు మాట్లాడుతాడు. టాస్కులు ఇస్తే కష్టపడతాడు. ఇవన్నీ కూడా సుమన్ శెట్టి మీద మరికాస్త ప్రేమను పెంచాయి.

అమాయకుడు కాస్త అపరిచితుడు 

సుమన్ శెట్టి చాలా అమాయకంగా కనిపిస్తాడు. గతంలో ప్రియా శెట్టి మీరు గట్టిగా మాట్లాడరా అని అడిగినప్పుడు కూడా… అవసరం వస్తే మాట్లాడుతాను. అంటూ క్లారిటీగా సమాధానం చెప్పాడు. కాసేపటి క్రితమే బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో తనుజాకి మరియు సుమన్ శెట్టి కి ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ నడిచింది.


శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నటించిన హిట్ 3 సినిమా డైలాగ్స్ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకున్నారు. లోపలికి వెళ్దామా అని డైలాగ్ ఆ సినిమాలో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే డైలాగును వీరిద్దరూ రీ క్రియేట్ చేశారు. వీళ్ళ సంభాషణ పూర్తయిన తర్వాత తనుజ సుమన్ శెట్టికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.

ఇమ్మానుయేల్ ఫన్నీ రియాక్షన్ 

ఇమ్మానుయేల్ హౌస్ లో ఎంటర్టైనర్ అని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని నాగర్జున కూడా మొదటి వారంలోనే కన్ఫామ్ చేశారు. ఇక వీళ్లిద్దరూ హిట్ సినిమా సీన్ రీ క్రియేట్ చేసిన తర్వాత, సుమన్ శెట్టి వాయిస్ లోనే ఒరేయ్ దుర్మార్గుడా అంటూ ఇమ్మానుయేల్ ఇమిటేట్ చేశాడు.

Related News

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Big Stories

×