Bigg Boss Telugu 9 Episode: బిగ్ బాస్ షో ఆసక్తికర ఎపిసోడ్ అంటే అది వీకెండ్ ఎపిసోడ్. వీకెండ్ వచ్చిందంటే నాగార్జున వస్తాడు.. కంటెస్టెంట్ దుమ్ము దులిపిపోతాడు. వారమంతటి ఎపిసోడ్ రివ్యూ ఇచ్చి కంటెస్టెంట్స్ తప్పొప్పులను సరిచేస్తాడు. అందుకే వీకెండ్ ఎపిసోడ్ అనగానే ఆడియన్స్ అంత టీవీలకు అతుక్కుపోతారు. అలాగే ఈ వీకెండ్ కి నాగార్జున వచ్చేశాడు. అందరు ఊహించినట్టుగానే కంటెస్టెంట్స్ లెక్కలు తేల్చారు. హౌజ్ లో ఆటలో చీటింగ్ చేసిన వారి రంగులు బయటపెట్టాడు.
ఈ వారం కంటెస్టెంట్స్ వరల్డ్ పర్ఫామర్ గా రీతూ చౌదరి. సంచాలక్ గా, కంటెండర్ గా ఆమె అన్ ఫెయిర్ గేమ్ ఆడింది. పైగా ఏడుస్తూ ఎమోషనల్ డ్రామా ప్లే చేసింది. అందుకే ఈ వారం రీతూ చౌదరికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్ లో ఆమె ఫేవరిటిజం బయటపెట్టాడు. వీడియో చూపించి మరి రీతూ చౌదరి బండారం బయటపెట్టాడు. డిమోన్ పవన్ కెప్టెన్ గా చూడాలని ఉందని, నువ్వు కెప్టెన్ అవ్వాలని మాట తీసుకుంది. కానీ, చివరకు ఆమె కెప్టెన్సీ టాస్క్ కి సంచాలక్ గాఉండటంతో డియోన్ పవన్ కి ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. దీంతో కెప్టెన్ అవ్వాల్సిన భరణికి అన్యాయం జరిగింది. రంగు పడుద్ది టాస్క్ లో భరణిని అన్ ఫెయిర్ గా ఎలిమినేట్ చేసి.. డిమోన్ పవన్ ని కెప్టెన్ గా ప్రకటించింది. అంతేకాదు కాలచక్రం టాస్క్ లో ప్రియా, రీతూ లు చేసిన తప్పులను నాగ్ బయటపెట్టారు. అందరి ముందు వారు అసలు రంగు బయటపెట్టారు.
ఆఖరికి తన కెప్టెన్సీ అన్ ఫెయిర్ అని తెలిసి స్వయంగా డిమోన్ పవనే.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో హోస్ట్ నాగార్జున కెప్టెన్సీ రద్దు చేశారు. అదే సేమ్ కంటెండర్స్ తో కెప్టెన్సీ టాస్క్ పెట్టి.. రీతూ చౌదరిని సంచాలక్ నిర్ణయించారు. రేపు మళ్లీ అదే కంటెండర్స్ కి కెప్టెన్సీ టాస్క్ ఉండబోతుంది. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరిష్ భార్య వర్చ్వువల్ వేదికగా నాగార్జునతో మాట్లాడారు. హరీష్ తినకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, హౌజ్ లో తినకపోయినా.. డాక్టర్ ముందు చక్కగా తిన్నారని చెప్పి ఆమెకు ధైర్యం ఇచ్చారు. ఇక ఆ తర్వాత నాగ్ మళ్లీ హౌజ్ మేట్స్ దగ్గరికి వచ్చారు.
మొదట సుమన్ శెట్టి పిలిచి.. తన ఆటతీరును ప్రశంసించారు. హౌజ్ లో అందరితో పాటు ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టించి మరి సుమన్ శెట్టి ఆటను కొనియాడారు. మొదటి వారం కంటే రెండో వారంలో తన ఆట తీరు చాలాబాగా మెరుగుపరుచుకున్నారని, ఇదే కొనసాగించాలంటూ ప్రొత్సహించారు. ఆ తర్వాత అను ఇమ్మాన్యుయేల్ గేమ్ ని కూడా నాగ్ పొగిడారు. తన ఆట చాలా చక్కగా ఉందని.. చాలా బాగా జన్యున్ గా ఆడుతున్నావ్ అని చెప్పారు. ఆ తర్వాత టెనెంట్స్ నుంచి ఓనర్ గా గెలిచిన రాము రాథోడ్ ని కూడా ప్రశంసించారు. ఓనర్స్ టాస్క్ లో అంతా కింద మీద పడుతూ.. కొట్టుకుంటుంటే.. సైలెంట్ గా టాస్క్ గెలిచి ఓనర్ అయిపోయావంటూ చమత్కరించారు.
రామ్ రాథోడ్ ఓనర్ అయిన తీరును హోస్ట్ నాగ్ ప్రశంసించారు. అలాగే హరిశ్ హారికని కన్సోల్ చేసి తీరును నాగ్ కొనియాడారు. బిగ్ బాస్ చెప్పిన పనిని చాలా చక్కగా.. బాధ్యత నిర్వర్తించిన తీరు బాగుందని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అందరి ముందు తనూజ పరువు తీశారు. ఆమెను పలిచి.. నాగ్ చప్పట్లు కొట్టారు. ‘ఎందుకు అలా షాక్ అవుతున్నావ్.. చప్పట్లు ఎందుకు కొడుతున్నారని షాక్ అవుతున్నావా? నీ ఆట కూడా అంతేనమ్మా.. మాకేం అర్థం కాలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఎమోషన్స్, ప్రతి దాన్ని బూతద్దంలో చూడటం ఆపేసి ఆటపై ద్రష్టి పెట్టమని హోస్ట తనూజ ఆటను సరిచేశారు.