Bigg Boss Telugu 9: ఈసారి బిగ్ బాస్ సరికొత్త థీమ్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎన్నడు లేనివిధంగా ఈసారి సామాన్యులను కూడా హౌజ్‌లోకి తీసుకువచ్చారు. పైగా కామనర్స్‌ని హౌజ్ ఓనర్స్ చేసి ఫుల్ పవర్ ఇచ్చాడు. దీంతో కామనర్స్ ఓవరాక్షన్ మామూలుగా లేదు. తమకు ఇష్టారితీన కండిషన్స్ పెడుతూ సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు. అంతేకాదు నామినేషన్స్, టాస్క్ల్లోనూ మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక వారి తీరుకు సెలబ్రిటీలు తలలు పట్టుకుంటున్నారు. కాగా ఈసారి బిగ్ బాస్ హౌజ్లో రెండు ఇళ్లులు పెట్టి ఓనర్స్, టెనెంట్స్ అంటూ డివైడ్ చేశారు.
ఎవరూ ఊహించని విధంగా కామనర్స్ని హౌజ్ ఓనర్స్గా.. సెలబ్రిటీలను టెనెంట్స్గా ప్రకటించాడు బిగ్ బాస్. హౌజ్లో అన్ని అర్హతలు ఇచ్చి.. సెలబ్రిటీల చేత పనులు చేయించుకునే రైట్స్ ఇచ్చాడు. దీంతో మొదటి రోజు నుంచి కామనర్స్, సెలబ్రిటీల మధ్య వార్ మొదలైంది. తరచూ సెలబ్రిటీలను తప్పులను ఎత్తిచూపుతూ కామనర్స్ చెలరేగిపోతున్నారు. దీంతో కామనర్స్కి నెగిటివిటీ పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రియ, శ్రీజ, మర్యాద మనీష్లకు ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధం లేకుండా.. వారి నచ్చిన పాయింట్పై వాదనకు దిగుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు.. వాగ్వాదానికి సై అంటున్నారు. ఇక మనీష్కి అయితే ఓనర్స్, టెనెంట్స్ అనే తేడా లేదు. ఎవరూ వచ్చి అతడిని ప్రశ్నించిన ఒంటికాలిపై లేస్తున్నాడు. ఇలా కామనర్స్ ఆట ప్రతి ఒక్కరికి ఇరిటేషన్ తెప్పిస్తుంది.
‘కామనర్స్ ని ఎలిమినేట్ చేయండి’
దీంతో బయట వారికి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. దీంతో కామనర్స్ని హౌజ్నుంచి బయటకు పంపించండి అంటూ బిగ్ బాస్‌కు రిక్వెస్ట్స్ చేస్తున్నారు. శుక్రవారం నాగార్జున బిగ్బాస్కి సంబంధించి టిఆర్పి రేటింగ్ని షేర్ చేశాడు. ఈ పోస్ట్కి నెటిజన్స్.. నాగార్జున గారూ కామనర్స్ అందరిని ఎలిమినేట్ చేయండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓ నెటిజన్ అయితే.. ‘కామనర్స్ అందరిని ఎలిమినేట్ చేయండి లేదా సెలబ్రిటీలకు బానిసలుగా మార్చండి‘ అంటూ బిగ్ బాస్‌కి రిక్వెస్ట్ చేశారు. హౌజ్ కామనర్స్ ఆట తీరుపై వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. వారి బయట ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమైపోతుంది.
Also Read: Deepika Padukone : స్పిరిట్‌లోకి మళ్లీ వస్తున్న దీపిక… అరేయ్ ఏంట్రా ఇది
ఈ వీకెండ్ నాగార్జున సామాన్యులను హెచ్చరించిన వారి ఆట తీరును మారిస్తే బాగుంటుందని మిరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా బిగ్బాస్ కెప్టెన్సీ టాస్క్లో గెలిచిన కామనర్స్ నుంచి డిమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో.. బిగ్ బాస్ సెలబ్రిటీలకు గట్టి పోటీ పెట్టాడు. టెనెంట్స్గా ఉన్న వారిలో ఒకరికి హౌజ్ ఓనర్ అయ్యే అవకాశం ఇచ్చాడు. ఇందుకోసం వారికి క్లిష్టమైన టాస్క్ ఇచ్చాడు. హౌజ్ ఓనర్స్గా ఉన్న కామనర్స్.. విసిరిన వస్తువులను టెనెంట్స్(సెలబ్రిటీలు) పట్టుకుని వాటిని వారు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మిగతా టెనెంట్స్ చేతికి చిక్కకుండ ఆ వస్తువులను వారు కాపాడుకోవాల్సి ఉంటుంది. అలా చివరకు ఎవరి దగ్గర ఎక్కువ వస్తువులు ఉంటే వారు హౌజ్ ఓనర్స్గా గెలిచినట్టు. నేటి ఎపిసోడ్ టెనెంట్స్కి ఈ టాస్క్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. మరి ఇందులో ఎవరూ గెలిచి హౌజ్ ఓనర్ అవుతారో చూడాలి.