ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గుడ్ న్యూస్ చెప్పింది. సేవలను మరింత సులభతరం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింపుల్ గా పీఫ్ కు సంబంధించిన సెటిల్మెంట్స్ చేసుకునేందుకు సరికొత్త పాస్ బుక్ లైట్తో పాటు అనెక్సర్-కెను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ వీటితో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటి వరకు పీఎఫ్ పొందుతున్న ఉద్యోగులు తమ పాస్ బుక్ వివరాలను తెలుసుకోవడానికి మరో పోర్టల్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు మెంబర్ పోర్టల్ లో పాస్ బుక్ లైట్ ఆప్షన్ ను తీసుకొచ్చింది.
ఇక పాస్ బుక్ లైట్ తో పీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తమ అకౌంట్ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవడంతో పాటు తమ కాంట్రిబ్యూషన్స్, విత్ డ్రాయల్స్ అమౌంట్ సహా అన్ని వివరాలను ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయంతో పీఎఫ్ సర్వీసులు అన్నీ ఒకే చోట ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు సమయం ఆదా కావడంతో పాటు సర్వర్ సమస్యలకు చెక్ పడే అవకాశం ఉంటుంది.
ఇక ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఈజీగా PF అకౌంట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ చేయడానికి గతంలో పని చేసిన ఆఫీస్ కొత్త ఆఫీస్ కు అనెక్సర్-కె అనే ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ అందించేవాళ్లు. ఈ సర్టిఫికేట్ అనేది కేవలం పీఎఫ్ ఆఫీస్ ల మధ్య మాత్రమే షేర్ అయ్యేది. ఉద్యోగులు కావాలంటే పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు వారు తమ ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ స్టేటస్ ను ఆన్ లైన్ లో ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, పీఎఫ్ బ్యాలెన్స్, సర్వీస్ పీరియడ్ కొత్త ఖాతాలో సరిగ్గా అప్ డేట్ అవుతుందో? లేదో? నిర్థారించుకునే అవకాశం ఉంటుంది. ఇది మున్ముందు ఈపీఎస్ ప్రయోజనాలకు ఉపయోగపడనుంది.
ఇక ఇంతకు ముందుతో పోల్చితే పీఎఫ్ బదిలీలు, సెటిల్ మెంట్లు, అడ్వాన్సులు, రీఫండ్స్ లాంటి సేలవకు చాలా సమయం పట్టేది. కానీ, ఇకపై ఈ సర్వీసులు మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఇకపై అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ల ఆమోదంతో క్లెయిమ్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల పీఎఫ్ క్లెయిమ్స్, సెటిల్ మెంట్లు, అడ్వాన్సులు, రీఫండ్లు మరింత వేగంగా పూర్తి కానున్నాయి. ఉద్యోగులకు మేలు కలగనుంది.
Read Also: ఈ దేశంలో ఇంటర్నెట్ లేదు.. సోషల్ మీడియా లేదు.. ఇంకా పాత విధానాల్లోనే జీవిస్తున్న జనం!