BigTV English

Deepika Padukone : స్పిరిట్‌లోకి మళ్లీ వస్తున్న దీపిక… అరేయ్ ఏంట్రా ఇది

Deepika Padukone : స్పిరిట్‌లోకి మళ్లీ వస్తున్న దీపిక… అరేయ్ ఏంట్రా ఇది


Trolls on Deepika Padukone: బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరికి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. ఒకప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి మరి తీసుకున్న దీపికా పదుకోనెను.. ఇప్పుడు మాకు వద్దు బాబోయ్ అంటున్నారు మేకర్స్‌. పైగా సినిమాల్లో నుంచి అద్దంతరంగా తీసి పక్కన పడేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే స్పిరిట్‌లో నుంచి తీసేసి.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనరాని మాటలు అన్నీ అనేశాడు.

తాజాగా అంటే నిన్న… కల్కి 2 సినిమాలో నుంచి తీసేస్తూ.. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్లో ఆమెకు నటించే అర్హత లేదంటూ నిర్మాతలు ఒపెన్స్టేట్మెంట్ఇచ్చారు. గురువారం వైజయంతి మూవీస్ కల్కి 2 నుంచి దీపికాను తొలగిస్తున్నట్టు ఆఫిషియల్గా ప్రకటించారు. ఇక చివరిలో కల్కి లాంటి ప్రాజెక్ట్లో చేయాలంటే నిబద్దత, అర్హత ఉండాలంటూ దీపికాను ఉద్దేశిస్తూ చురక అట్టించారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం తెగ వైరల్ అవుతుంది. అలాగే షేర్ అవుతుంది. అది ఏంటంటే…


స్పిరిట్ లో చేస్తావా?

గురువారం… ఇటు టాలీవుడ్‌లో.. అటు బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దీపికా పదుకోణెనే. కల్కి 2 సినిమా నుంచి తొలగించడమే కాకుండా, అసలు ఈమెకు అర్హత లేదు. నిబద్ధత లేదు అంటూ చాలా స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేశారు. దీంతో ఒక్క సారిగా రెండు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో దీపికా పదుకోనెపై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అందులో ఒకటి తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే… శివాజీ సినిమాలో రజనీకాంత్ – సుమన్ మధ్య జరిగిన ఓ సంభాషణను సందీప్ రెడ్డి వంగా – దీపికా పదుకోణె మధ్య జరిగినట్టు క్రియేట్ చేశారు. దాంట్లో… “కల్కి నుంచి పోయాక ఇప్పుడు ఏం చేస్తారు..? రామయణ్‌లో చేస్తారా ? ఎస్ఎస్ఎంబీ 29లో చేస్తావా… సలార్ 2లో చేస్తావా.. పోని నా స్పిరిట్ మూవీలో ఛాన్స్ ఇవ్వాలా… డబుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది” అంటూ రాసుకొచ్చారు.

Also Read: Deepika Padukone: అయ్యే దీపికాకు అల్లు అర్జున్‌ కూడా హ్యాండ్‌ ఇచ్చాడుగా.. ఇక కెరీర్‌ క్లోజ్డ్?

దీపికాపై ఒపెన్ కామెంట్స్

దీంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ ఇలా చేయకున్నా… ఛాన్స్ వస్తే మాత్రం ఇలా చాయాల్సింది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, కల్కి 2 నుంచి తొలగించడం అనేది ఈ బాలీవుడ్ టాప్ హీరోయిన్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడే అంశమే అని చెప్పొచ్చు. స్పిరిట్ టైంలో అందరూ ఆ విషయాన్ని లైట్ తీసుకున్నా… ఇప్పుడు కల్కి 2 తో మళ్లీ రిపీట్ అవ్వడం వల్ల.. హీరోయిన్ పరువే పోయింది అనే మాటలే వినిపిస్తున్నాయి. అయితే, ఇన్ని మాటలు, ఇన్ని ట్రోల్స్, ఇన్ని అరోపణలు వస్తున్నా… దీపికా పదుకోణె మాత్రం సైలెంట్‌గా ఉండటం మాత్రం గమనార్హం అనే అనుకోవాలి. సాధారణంగా ఇండస్ట్రీలో చిన్న అరోపణలు వచ్చినా… మీడియా ముందుకు వచ్చి నిజా నిజాలు చెప్పడానికి సెలబ్రిటీలు ప్రయత్నం చేస్తారు. కానీ, దీపికా మాత్రం సైలెంట్‌గా ఉంటుంది.

Related News

VK Naresh: మళ్లీ పవిత్ర పేరు తీసుకొచ్చిన నరేష్.. ఆ ప్రేమ గుర్తొచ్చింది

K-Ramp Teaser Review : కంటెంట్ వదిలేసి మళ్లీ బిల్డప్ ను నమ్ముకున్నాడా?

Sadha Father: హీరోయిన్‌ సదా ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత

Jr NTR : షూటింగ్ స్పాట్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు

Kalki 2 : దీపిక ఇష్యూకు కోటిన్నరపైగా వ్యూస్… ఇప్పుడైనా అర్హత తెచ్చుకుంటుందా ?

Super Raja Movie : థియేటర్‌లోనే నీ G*** పగలకొడుతాం… హీరో మొహం మీద ఫ్యాన్ డెడ్లీ వార్నింగ్

Deepika Padukone: దీపికకు హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్‌… ఇక కెరీర్‌ క్లోజ్డ్ ?

Big Stories

×