Bigg Boss 9 Promo : బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మొదలైన తర్వాత చాలామంది టీవీలకి అతుక్కుపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అలానే గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది రియల్ క్యారెక్టర్స్ బయటపడిపోయాయి. సో మొదలైనప్పటి నుంచి ప్రతిసారి అందరు అటెన్షన్ తన వైపు పాజిటివ్ గానూ నెగిటివ్గానో గ్రాబ్ చేసుకుంటుంది సంజన.
ఒక తరుణంలో ప్రియా శెట్టితో మనీష్ మాట్లాడుతూ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నావు అని అడిగినప్పుడు. అతను సంజన పేరు చెప్పాడు. వెంటనే ప్రియా శెట్టి నువ్వు బిగ్ బాస్ ముందు సీసన్లు చూడలేదా అంటూ క్వశ్చన్ చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా సంజన సీజన్ నైన్ లో మొదటి కెప్టెన్ అయిపోయింది.
ప్రతి శనివారం నాగార్జున వచ్చి కంటెస్టెంట్లు ఎలా ఆడారు అని చెబుతూ ఉంటారు. అలానే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు. నాగార్జున వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది, ఒక్కొక్కరికి క్లాస్ పీకుతుంటే తడిచిపోతుంది. కొద్దిసేపటి క్రితమే బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. నాగార్జున సంజనకు క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టారు.
ఫ్లోరోసైని కాఫీ మరియు కర్రీ విషయం గురించి. అలానే రాము రాథోడ్ ప్రస్తావన గురించి. ఈ ప్రోమోలో టాపిక్ నడిచింది. మొత్తానికి ప్రోమోలో నాగార్జున హౌస్మెట్స్ కి కొన్ని సెటైర్లు, అలానే సంజనాకు సీరియస్ క్లాస్. యాస్ యూస్ వెల్ నాగార్జున స్టైలింగ్ ఈ ప్రోమోలో అదిరిపోయింది.