Bigg Boss Telugu 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సీజన్లో ఒక కామన్ ఆడియోను సెలెక్ట్ చేయడానికి బిందు మాధవి, నవదీప్, అభిజిత్ ఈ ముగ్గురు జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియకు అగ్నిపరీక్ష అనే ఒక పేరు పెట్టారు. b ప్రస్తుతం ఈ అగ్ని పరీక్ష అనే పేరు ట్రెండ్ గా మారింది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో లు కూడా విపరీతమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అన్ని సీజన్ లాగా కాకుండా ఈ సీజన్ మరింత కొత్తగా ఉండబోతుంది. హోస్ట్ నాగార్జున కూడా ఇది చదరంగం కాదు రణరంగం అంటూ చెబుతున్నారు. అంటే ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ మాటలతో అర్థం అయిపోతుంది. ఇప్పుడు తాజాగా అగ్నిపరీక్షకు సంబంధించిన మొదటి ప్రోమో ను విడుదల చేసింది జియో హాట్ స్టార్.
అగ్ని పరీక్ష ప్రోమో
కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ ప్రోమో విపరీతమైన ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఈ ప్రోమోలో మంచి ఫన్ కూడా క్రియేట్ అయింది. ఒక పర్సన్ వచ్చి మొదటి టాస్క్ చేశారు. అయితే నవదీప్ ను శ్రీముఖి చూపిస్తూ మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగింది. దానికి సమాధానంగా అమ్మాయి బానే ఉన్నాడు అంది. చిన్న టాస్క్ చేసిన తర్వాత నవదీప్ చేయని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతిలో పెట్టి సంవత్సరం తిరిగే లోపల నాకు నలుగురు పిల్లలు కావాలి అని డిమాండ్ చేసింది. వెంటనే అమ్మాయి ఆశ్చర్యపడింది. మొత్తానికి ఈ షో మంచి ఎంటర్టైన్ గా ఉండబోతుంది అని ఒక క్లారిటీ వస్తుంది.
నెక్స్ట్ లెవెల్ సీజన్స్
బిగ్ బాస్ మొదటి సీజన్ వచ్చినప్పుడు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కువమంది తెలిసిన సెలబ్రిటీలు రావడం. అంతకుమించి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడం ఈ షోకు బాగా కలిసి వచ్చింది. అక్కడితో ప్రతి సీజన్ కూడా మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం వస్తున్న 9 వ సీజన్ మీద కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి అంతకు మించిన అంచనాలే ఉన్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.
Also Read : Little Hearts Teaser: అన్ని తిట్లు మీ అమ్మకే రా, ఇంత దారుణంగా తయారయ్యారు ఏంటయ్యా?