Naidupeta Station: భారతీయ రైల్వే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూపర్ న్యూస్ చెప్పింది. మరో సూపర్ ఫాస్ట్ రైలుకు ఏపీలోని ఓ రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇకపై చర్లపల్లి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్ లో ఆగనున్నట్లు తెలిపింది. ఈ కొత్త హాల్టింగ్ ఆగష్టు 18 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. చాలా కాలంగా ఈ రైలును అక్కడ ఆపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారి విజ్ఞప్తి సానుకూలంగా స్పందించి స్టాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో నాయుడుపేటకు రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులకు లాభం కలగనుంది.
చర్లపల్లి-చెన్నై మధ్య రాకపోకలు
చర్లపల్లి-చెన్నై మధ్య రాకపోకలు కొనసాగించే (12604) సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు.. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడుకు చేరుకుంటుంది. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ రైలు రోజూ సాయంత్రం 5:25 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు మొత్తం 12.15 గంటల పాటు ప్రయాణిస్తుంది. ఈ రైలు వారంలో 7 రోజులు అందుబాటులో ఉంటుంది.
Boosting convenience in Andhra Pradesh!🚆#SouthernRailway introduces a new stoppage at Nayudupeta for Train No.12604 Charlapalli–Dr MGR Chennai Central SF Express from 18.08.2025, benefitting passengers of this growing suburban hub.#AndhraPradesh #IndianRailways pic.twitter.com/PJKG4gX12P
— Southern Railway (@GMSRailway) August 18, 2025
Read Also: దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?
19కి చేరిన స్టేషన్ల సంఖ్య
ఈ సూపర్ ఫాస్ట్ రైలు చర్లపల్లిలో ప్రారంభమైన తర్వాత రోజు తెల్లవారుజామున 3.28 గంటలకు నాయుడుపేటకు చేరుకుంటుంది. అక్కడ 2 నిమిషాల పాటు ఆగిన తర్వాత 3.30 గంటలకు మళ్లీ బయల్దేరనుంది. ఈ రైలు కొన్ని ముఖ్యమైన స్టేషన్లలోనే ఆగుతుంది. నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా గుంటూరు జంక్షన్ చేరుకుంటుంది. అక్కడ 10 నిమిషాల పాటు ఆగుతుంది. అక్కడి నుంచి తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, సూళ్లూరుపేట మీదుగా చెన్నైకి చేరుకుంటుంది. ఈ సూపర్ ఫాస్ట్ రైలు చర్లపల్లి నుంచి చెన్నై మార్గంలో ఇప్పటివరకు మొత్తం ప్రయాణంలో 18 స్టేషన్లలో ఆగుతుండగా.. ప్రస్తుతం నాయుడుపేట స్టేషన్‌లో ఆగడంతో ఈ సంఖ్య 19కి చేరింది. నాయుడుపేట సబర్బన్ పట్టణంగా ఎదుగుతున్న క్రమంలో.. రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నాయుడుపేట పరిసర ప్రాంత వాసులకు ప్రయోజనం కలగనుంది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నాయుడుపేటతో పాటు అక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులు ఇకపై ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Also: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ప్రారంభం ఎప్పుడంటే?