Poor Habits: అష్ట దరిద్రాలకు కారణాలు మనుషులు చేసే చిన్న చిన్న తప్పులేనట. ఆ కారణాల వల్లే వ్యక్తులు జీవితాలు తారుమారు అవుతాయట. కోట్లకు అధిపతులుకు కూడా ఆస్థులు కరిగిపోయి దివాలా తీసే పరిస్థితి వస్తుందట. ఆ అలవాట్లు మీలో ఉంటే తెలుసుకుని వెంటనే మార్చుకోండి లేదంటే మీ జీవితాలు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా మారిపోతాయో ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషుల కష్టాలకు కారణం ఎవరో కాదు తాము ఆచరించే పద్దతులే అంటున్నారు పండితులు. తెలిసో తెలియకో ఆచరించే ఆ పద్దతులే మనుషుల దరిద్రాలకు కారణం అవుతుంటాయట. అయితే ఆ కారణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీలు బోట్టు ధరించాలి: ఇంట్లో ఉన్న స్త్రీలు కచ్చితంగా ప్రతిరోజూ నుదుటిన బొట్టు ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బొట్టు లేకుండా ఉండకూడదు. బొట్టు విషయంలో అసలు నిర్తక్ష్యం పనికిరాదంటున్నారు పండితులు.
ఇంటి వాస్తు: ఇంటి వాస్తు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఉత్తర దిశలో ఎప్పుడూ బరువులు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది. నెగటివ్ ఎనర్జీ పెరిగిపోయి కుటుంబం సభ్యుల మధ్య గొడవలు జరుగతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయట.
ధూమపానం నిషేధం: ఇంట్లో ఎప్పుడూ కూడా ధూమపానం కానీ మద్యపానం కానీ చేయకూడదట. ఇంట్లో మందుతాగడం, పొగ తాగడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. దీంతో మాత లక్ష్మీ దేవి ఇంట్లోంచి వెళ్లిపోతుందటని.. వెంటనే ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు హెచ్చిరిస్తున్నారు.
ఇంట్లో వాళ్ల సలహా తీసుకోవాలి: మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఇంట్లో వాళ్ల సలహా కచ్చితంగా తీసుకోవాలి. అందరి అనుమతితో ఆ పని మొదలుపెట్టాలి. లేదంటే ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందట. ఒకవేళ ఇంట్లో వాళ్ల సమ్మతితో చేసిన పనిలో ఆటంకాలు ఎదురయిన కూడా ఇంటి సభ్యుల సహకారం ఉంటుంది.
భోజనం ప్లేటు: తిన్న వెంటనే ఆ ప్లేటును తీసేయాలట. అలా కాకుండా ఆ ప్లేటు అలాగే ఉంచితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
బాత్రూం: ఇంట్లో బాత్‌రూం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలట. బాత్రూం శుభ్రంగా లేకపోతే నెగటివ్ ఎనర్జీ వస్తుందట. దాని వల్ల ఆ ఇంట్లో వాళ్లు అశాంతికి మరియు అనారోగ్యానికి గురి అవుతారట.
సాయంత్ర పూట ఏ పని ప్రారంభించకూడదు: ఇంట్లో ఏదైనా పని ప్రారంభించాల్సి వస్తే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందట.
ఇంకా ఇంట్లో వాల్లు ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నారు…? ఎందుకు వెళ్తున్నారు అని అడగకూడదట. అలాగే ఇంట్లో ఏవైనా నల్లటి వస్తువులు ఉంటే వెంటనే తీసేయాలని సూచిస్తున్నారు పండితులు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు