Little Hearts Teaser: సోషల్ మీడియా ఉపయోగించుకొని నేడు ఇండస్ట్రీలో గుర్తింపు సాధించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు instagram లో ఆకట్టుకునే రీల్ చేస్తే చాలు, 20 మంది ఫాలో అవుతారు ఆ కంటెంట్ ని 10 మంది షేర్ చేస్తారు. అక్కడితో గుర్తింపు రావడం మొదలవుతుంది. ఆ రీల్ చేసిన వాడికి ఊపు వస్తుంది. ఇంకో పది చేయాలనిపిస్తుంది. ఆ పది పది కాస్త పరిశ్రమ వైపుకు దారి తీసేలా చేస్తాయి.
ముందు మీమ్ లు వేయడంతో కెరియర్ స్టార్ట్ చేశాడు మౌళి. ఆ తర్వాత మౌళి యూట్యూబ్లో చేసే వీడియోలు విపరీతంగా చాలామందిని ఆకట్టుకున్నాయి. అలానే ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ కూడా ఇంస్టాగ్రామ్ నుంచి తనకు ఎక్కువ సంపాదన వస్తుంది అని మౌలి చెబుతూ ఉంటాడు. ముందుగా హ్యాపీ బర్త్డే అనే సినిమాలో కనిపించాడు మౌళి. అయితే అతనికి బాగా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం 90’s మిడిల్ క్లాస్ బయోపిక్.
ఇంట్రెస్టింగ్ టీజర్
మామూలుగా వేసవికాలంలో చిన్నపిల్లల క్రికెట్ ఆడుకోవడం సహజం. అలానే మన జీవితంలో కూడా చాలా మంది ఆడుకునే ఉంటాం. చిన్న గొడవ జరిగితే చాలు ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మరీ తిడతాం. అన్ని తిట్లు తిట్టిన తర్వాత సడన్ గా సేమ్ టు యు అని ఒకడు అంటాడు. నువ్వు తిట్టిన తిట్లు అన్నీ కూడా మీ అమ్మకే అంటాడు. బేసిగ్గా ఇవి ప్రతి గ్యాంగ్ లోని జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మౌళి నటిస్తున్న లిటిల్ హార్ట్స్ టీజర్ కూడా ఇదే గొడవతో స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడి నుంచి మొదలైన టీజర్ ఆధ్యాంతం ఆకట్టుకునేలా ఉంది.
హిట్టు కల కనిపిస్తుంది
ఇకపోతే చాలా మంది మీద చదువు గురించి ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అదే ఈ సినిమాలో చూపెడుతున్నారు. అలానే ఒక మిడిల్ క్లాస్ ఇద్దరు పిల్లలు ఎందుకు ఉంటారంటే, సమాజం పెట్టే టార్చర్ కి ఒకటి చచ్చిపోయిన ఇంకొకటి మిగిలి ఉంటాడు కాబట్టి అనే ఫినిషింగ్ డైలాగ్ ఈ టీజర్ లో హైలెట్. ఈ సినిమాకి మౌళి స్నేహితుడు సింగిత్ సంగీత దర్శకుడుగా చేస్తున్నాడు. ఇటీవలే రాజాగాడికి అనే పాట ఈ సినిమా నుంచి విడుదలైంది. ప్రస్తుతం ఆ పాటకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇకపోతే సోషల్ మీడియాలో మౌలికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Also Read : AR Murugadoss : తెల్లార్లు అంటే కుదరదు… ఆ హీరోపై డైరెక్టర్ అసహనం