Big Boss 9 Update : బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. షో మొదలై నేటితో ఆరు రోజులు పూర్తయింది. ఈ ఆరు రోజుల్లో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరి క్యారెక్టర్ బయటపడింది. మొత్తానికి ఈరోజు కింగ్ నాగార్జున ఈజ్ బ్యాక్. అయితే అందరిలోనూ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ నెలకొంది. షో మొదలైన రెండు రోజులకే సంజనా ఎక్కువ రోజులు ఉండదు త్వరగా ఎలిమినేట్ అయిపోతుంది అని అందరూ ఊహించరు. ఆశ్చర్యకరంగా సంజన కెప్టెన్ అయిపోయింది.
శ్రేష్టి వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జానీ మాస్టర్ అసిస్టెంట్ గా ఈవిడ బాగా పాపులేరు. అసిస్టెంట్ గా పాపులర్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. జానీ మాస్టర్ పైన కొన్ని ఆరోపణలు చేయటం. వాటిలో నిజ నిజాలు ఇంకా తేలాల్సి ఉన్నాయి. శ్రేష్టి వర్మ బిగ్ బాస్ సీజన్ 9 కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి వారంలోని ఎలిమినేట్ అయిపోయింది శ్రేష్టి వర్మ. గేమ్ లో తన ఆట తీరు పెద్దగా ఉండకపోవడం వలన. అలానే పెద్దగా తన నుంచి ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వలన. అలానే చాలామందికి దూరంగా ఉండటం వలన శ్రేష్టి వర్మ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు.
స్రవంతి సీరియల్ ఫ్రేమ్ భరణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీల్లో చాలామంది సీరియల్ ను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. వాళ్లందరికీ భరణి పరిచయం. అయితే బిగ్ బాస్ షో టెనెంట్స్ మరియు ఓనర్స్ కి మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా టెనెంట్స్ కూడా ఓనర్స్ ప్రమోట్ అవుతూ ఉంటారు. ఈవారం టెనెంట్స్ నుండి ఓనర్స్ కు భరణి ప్రమోట్ అయ్యారు.
Also Read : Kantara Chapter 1 : మానవాతీత శక్తులు నాగ సాధు, మెంటల్ మాస్ స్టోరీ లైన్