E-Paper
Advertisement

Bigg Boss 9 Promo : గుక్క పెట్టి ఏడ్చేసిన ఇమ్మానుయేల్, మాస్క్ మెన్ హరీష్ కి నాగార్జున మాస్ బ్యాటింగ్

Bigg Boss 9 Promo : గుక్క పెట్టి ఏడ్చేసిన ఇమ్మానుయేల్, మాస్క్ మెన్ హరీష్ కి నాగార్జున మాస్ బ్యాటింగ్

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున ఎంట్రీ తో మరింత జోస్ ఫుల్ గా కొనసాగుతుంది. జోష్ ఎంజాయ్మెంట్ తో పాటు నాగర్జున అందరికీ బీభత్సమైన వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ వారం రోజుల్లో జరిగిన అన్నిటి పైన నాగార్జున మాట్లాడారు.

ఇక ఈ వారం బిగ్ బాస్ షోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఇదివరకే ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమో మాత్రం విపరీతమైన ఆసక్తిని పెంచుతుంది. ఇమ్మానుయేల్ మాస్క్ మాన్ హరీష్ ను గుండు అంకుల్ అనే దాని పైన నాగార్జున క్లాస్ స్పీకర్.

గుక్క పెట్టి ఏడ్చేసిన ఇమ్మానుయేల్ 

నాగార్జున ఇమ్మానియేల్ ను అడుగుతూ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా అని అడిగారు. దానికి సమాధానంగా ఇమ్మానుయేల్ క్యాజువల్ గా తీసుకుంటారని అలా అన్నాను సార్ అన్నాడు. అతను సరదాగా అన్నాడని హౌస్ లో ఎంతమంది అనుకుంటున్నారు అని నాగార్జున అడగగానే అందరూ కూడా చేతులెత్తారు. దీనికి నాగార్జున మాట్లాడుతూ హరిత హరీష్ హౌస్ అంతా కాదు ఆడియన్స్ కూడా అలానే అనుకున్నారు.

ఈ మాటలు చెప్పగానే ఇమ్మానుయేల్ తనను ఆడియన్స్ తో పాటు హౌస్మెట్స్ ఎంతలా లవ్ చేస్తున్నారో అర్థం చేసుకుని కన్నీళ్లు పెట్టుకొని గుక్కపెట్టుకుని ఏడ్చాడు. అలానే ఇమ్మానుయేల్ ఎంటర్టైనర్ అని నాగార్జున అనగానే భావోద్వేగానికి లోనైపోయాడు. నవ్విస్తున్నాడు తప్ప బాడీ సేమింగ్ అనే ఉద్దేశం అతనికి లేదు అని నాగార్జున తేల్చి చెప్పేసారు.

మాస్క్ మెన్ కు మాస్ బ్యాటింగ్ 

హరీష్ కు అసలు ఆడపిల్లలంటే విపరీతమైన గౌరవం అని అనుకున్నాను. అంటూ హరీష్ గతంలో ఆడవాళ్ళతో ఆడుతున్నాను అని అర్థమైంది అన్న వీడియోను నాగార్జున చూపించి మరి మళ్ళీ హరీష్ తో మాస్ బ్యాటింగ్ చేశారు. తనుజ ఇమ్మానియేల్ భరణి నాకు తెలియలేదు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను. తర్వాత అర్థమైంది ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానని అన్న హరీష్ వీడియోను నాగార్జున ప్రస్తావించారు. నేను క్వశ్చన్ చేస్తున్నాను రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పాలని ట్రై చేస్తున్నాను అంటూ హరి సమాధానం ఇచ్చాడు. ఈ విషయంలో కూడా హౌస్ మేట్స్ అందరూ హరీష్ కు వ్యతిరేకంగా చేతులెత్తారు. నాగార్జున కూడా హరీష్ పైన ఫైరయ్యారు. నేను షో నుంచి వెళ్ళిపోతాను అని కూడా హరీష్ చెప్పినట్లు ప్రోమోలో ఉంది.

Also Read : Sai Tej : ఆ పసిపాప గురించి మీడియా స్పందిస్తుందేమో అని ఎదురు చూశా, సాయి తేజ్ ఆవేదన

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×