హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. గంటలో 12 సెం.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. రాయదుర్గం, షేక్‌పేట, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, రామ్‌నగర్, ముషీరాబాద్, తార్నాక, ఎల్బీనగర్, కుషాయిగూడ, కాచిగూడ, కాప్రా, కీసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రధాన రోడ్లు చెరువుల్లా మారాయి.
కాలువలో కొట్టుకుపోయిన యువకులు
ఆదివారం కుండపోత వర్షం నగరాన్ని కుదేలు చేసింది. హబీబ్‌నగర్‌లో అఫ్జల్‌సాగర్ కాలువలో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. రాము డ్రైనేజీలో పడగా, అతడిని కాపాడేందుకు అర్జున్ ప్రయత్నించాడు. ఇద్దరూ డ్రైనేజీలో కొట్టుకుపోయినట్లు సమాచారం. ముషీరాబాద్ వినోదనగర్‌లో సన్నీ (24) నాలాలో పడిపోయాడు. పోలీసులు, GHMC, HYDRA బృందాలు గాలింపు మొదలుపెట్టాయి.
నగరంలో గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దీంతొ నగరంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దఅయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. మియాపూర్ మదీనాగూడ మార్గంలో వరద నీరు భారీగా చేరింది. కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఇండ్లలో నీరు ప్రవేశించింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎమ్మెల్యే కాలనీ, హైటెక్ సిటీ, అమీర్‌పేట, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్, అంబర్‌పేటలో రోడ్లు చెరువుల్లా మారాయి.
వర్షపాతం రికార్డ్
అబ్దుల్లాపూర్‌మెట్‌లో 12 సెం.మీ, షేక్‌పేటలో 8.0, వట్‌పల్లిలో 6.3 సెం.మీ వర్షం నమోదైంది. మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో 5.53, నేరెడ్‌మెట్‌లో 5, బండ్లగూడలో 4.75, మల్లాపూర్‌లో 4.2, నాచారంలో 4.13, ఉప్పల్ చిలుకానగర్‌లో 3.85 సెం.మీ వర్షం కురిసింది.
గచ్చిబౌలి ఒకరు మృతి
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో వట్టి నాగులపల్లిలో ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు పాలయ్యారు. వైద్య సిబ్బంది గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
వర్షం కారణంగా నగరంలో రోడ్లు ముంపునకు గురయ్యాయి. పౌరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. GHMC, HYDRA బృందాలు నీటిని తొలగించేందుకు పని చేస్తున్నాయి.
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి