BigTV English

Bigg Boss 9: సందడి చేసిన మిరాయ్ టీం.. ఇమ్మానుయేల్ దెబ్బకు తేజ ఏం చేశారంటే?

Bigg Boss 9: సందడి చేసిన మిరాయ్ టీం.. ఇమ్మానుయేల్ దెబ్బకు తేజ ఏం చేశారంటే?

Bigg Boss 9: ఈ మధ్యకాలంలో రియాల్టీ షోలలో కూడా పలు చిత్రాల బృందాలు వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సెప్టెంబర్ 12వ తేదీన అత్యంత ఘనంగా రిలీజ్ అయిన చిత్రం మిరాయ్. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జ (Teja sajja) తాజాగా నటించిన చిత్రం ఇది. సూపర్ యోధ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ సినిమాతో మొదటి రోజే రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్గా రితిక నాయక్ చాలా అద్భుతంగా ఒదిగిపోయారు.


స్టేజ్ పై సందడి చేసిన మిరాయ్ టీం..

ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర బృందం బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్ పై సందడి చేశారు. ఆదివారానికి సంబంధించిన ఎపిసోడ్ ని నిర్వాహకులు స్ట్రీమింగ్ చేయనుండగా.. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇకపోతే స్టార్ మా నిర్వాహకులు తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. అందులో తేజా సజ్జా (Teja sajja) హీరోయిన్ రితిక నాయక్ (Ritika Nayak) మిరాయ్ టీం తరఫున వచ్చి సందడి చేశారు.

ఆకట్టుకుంటున్న ప్రోమో..


స్టేజ్ పైకి వీరిద్దరూ రాగానే అటు ఇమ్మానుయేల్ వైబ్ ఉందిలే బేబీ వైబ్ ఉందిలే అంటూ పాట పాడడం మొదలుపెట్టారు. వెంటనే తేజ మాట్లాడుతూ.. “మీ వైబ్ చూస్తే అర్థమవుతుంది మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు” అని తేజ అనగా.. రోజుకు ఒక వైబ్ ఇక్కడ అంటే తన ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ నవ్వించేశారు ఇమ్మానుయేల్. ఇక నాగార్జున మాట్లాడుతూ.. “మిరాయ్ కథలో ఏం నచ్చి మీరు సినిమా చేశారు* అని ప్రశ్నించగా.. “మన ఇండియన్ ఇతిహాసాలను ఒక యాక్షన్ అడ్వెంచర్ లో మిక్స్ చేసి ఒక గ్రాండ్ స్కేల్ విలువలతో ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా దొరకడం కష్టం. నాకు దొరికింది వెంటనే దూకేశాను” అంటూ తెలిపారు తేజ. ఇక రితిక మాట్లాడుతూ..” మా అమ్మకు మీరు చాలా ఇష్టమైన హీరో.. మా అమ్మ మీ ప్రతి సినిమాను మిస్ చేయకుండా చూస్తుంది” అంటూ తెలిపారు.

ALSO READ:SSMB 29: కెన్యా షెడ్యూల్ కంప్లీట్.. నెక్స్ట్ ఎక్కడంటే?

దెబ్బకు భయపడి పోయిన తేజ..

ఇకపోతే అన్ని సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా బొమ్మ గీయడానికి ఒకరు.. దానిని ఐడెంటిఫై చేయడానికి ఇంకొకరు ముందుకు వచ్చారు. బొమ్మ గీయడానికి ఇమ్మానియేల్ రాగా.. దానిని గెస్ చేయడానికి రాము రాథోడ్ విచ్చేశారు. కామనర్స్ నుండి కళ్యాణ్, మనీష్ వచ్చేశారు. ఇంకా కళ్యాణ్ గీసిన బొమ్మను చూసిన వెంటనే మనీష్ కాటుక కళ్ళు అంటూ ఐడెంటిఫై చేయగా.. వెంటనే గంట తీసుకొని కొట్టేశారు. దానికి ఇమ్మానియేల్ మాట్లాడుతూ.. చెప్పనివ్వండి సర్ వాళ్ళు ఎలాగో రాంగ్ గా చెబుతారు అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఇమ్మానుయేల్ వేసిన బొమ్మను రాము రాథోడ్ ఐడెంటిఫై చేయలేక పోతాడు. దాంతో ఇమ్మానుయేల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అక్కడి వారంతా పగలబడి నవ్వుతారు గెస్ చేయలేకపోవడంతో నాగార్జున స్టేజ్ పై ఉన్న తేజ రితిక తో డాన్స్ చేయిస్తారు. ఇక తర్వాత తనుజా టీం కూడా మిస్టేక్ చేయగా.. మళ్లీ తేజాను డాన్స్ చేయమని చెబితే సర్ ఇంతకంటే ఘోరం నాకొద్దు కావాలంటే నేను హౌస్ లోకి వెళ్తాను అంటూ భయపడిపోయారు. మొత్తానికైతే అటు ఇమ్మానుయేల్ దెబ్బకు ఇటు కంటెస్టెంట్స్ దెబ్బకు తేజా భయపడిపోయారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ప్రోమో బాగా ఆకట్టుకుంటుంది.

Related News

Bigg Boss 9: కామనర్స్ కి ఇచ్చి పడేసిన నాగ్.. ఇంత పార్శియాలిటీనా?

Bigg Boss 9 : ఒరేయ్ సంజన ఏంట్రా అంత సీరియస్ సిచువేషన్ లో తెలియకుండా కామెడీ చేస్తుంది

Bigg Boss 9 : అందరి బాక్సులు బద్దలు, దుమ్ము దులిపేసిన కింగ్ నాగార్జున

Bigg Boss 9 : నేను తిట్టించుకోవడానికి రాలేదు, సంజన కుళాయి ఓపెన్ చేసింది

Bigg Boss 9 Promo : గుక్క పెట్టి ఏడ్చేసిన ఇమ్మానుయేల్, మాస్క్ మెన్ హరీష్ కి నాగార్జున మాస్ బ్యాటింగ్

Big Boss 9 Update : శ్రేష్టి వర్మ ఎలిమినేట్.. హౌస్ లో భరణికి ప్రమోషన్

Bigg Boss 9 : సృష్టి వర్మ ఎలిమినేటెడ్? బయట జానీ మాస్టర్ ఫ్యాన్స్ వెయిటింగ్

Big Stories

×