Maruthi: ఈ రోజుల్లో సినిమా దర్శకుడుగా పేరు సంపాదించుకోవడం అనేది మునుపటి రోజుల్లో కంటే కూడా సులభమైన ప్రక్రియ అని చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమా అంటే ఎక్కడో ఉండేది అనిపించేది. కానీ ఈరోజు సినిమా వాళ్లు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్ళనే వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం నమ్ముకునే పరిస్థితి వచ్చింది. అలానే కొంతమంది దర్శకులు బలమైన కథనం లేకపోయినా కేవలం వినోదంతో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నారు.
కథను పక్కనపెట్టి వినోదాన్ని నమ్ముకుని బాక్సాఫీసు వద్ద సక్సెస్ అయిన దర్శకులు ఈమధ్య బాగా ఫేమస్. జాతి రత్నాలు సినిమాతో అద్భుతమైన గుర్తింపు సాధించుకున్నాడు అనుదీప్ కె.వి. మ్యాడ్ సినిమాతో అద్భుతమైన సక్సెస్ సాధించాడు కళ్యాణ్ శంకర్. రీసెంట్గా రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు సాయి మార్తాండ్. ఇలా సక్సెస్ అయిన దర్శకులతో పాటు మంచి సినిమా తీసి సరైన ఆదరణ నోచుకోని దర్శకులు కూడా ఉన్నారు.
ఈ రోజుల్లో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఈ రోజుల్లో సినిమా ఆరోజుల్లో ఒక సంచలనం. అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తరువాత వచ్చిన బస్టాప్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్. ఆ సినిమా తర్వాత డబల్ మీనింగ్స్ ఉన్న డైలాగులు రాయడం మానేశాడు మారుతి. అదే విషయం గురించి ఈరోజు కూడా బ్యూటీ అనే ఒక సినిమా ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు.
డబుల్ మీనింగ్ డైలాగ్స్ నేను బస్ స్టాప్ సినిమా తర్వాత రాయడం మానేశాను. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి రావాలి. ఒకప్పుడు బూతు డైలాగులు రాసే దర్శకుడు ఈరోజు 400 కోట్ల సినిమా చేస్తున్నాడు. దీనిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. సినిమా జనాల్లోకి వెళ్లడానికి ఫేమస్ అవ్వడానికి దిగజారకండి అంటూ మాట్లాడారు.
బార్బరిక్ అనే సినిమా తీసిన దర్శకుడు మారుతికి మంచి స్నేహితుడు. పలు సందర్భాలలో ఈ టైటిల్ జనాలకు అర్థం కాదు అని మారుతి ఆదర్శకుడికి చెప్పి చాలా టైటిల్స్ సజెస్ట్ కూడా చేశారట. సినిమా కథకు ఈ టైటిల్ కు సంబంధం ఉండటం వలన దర్శకుడు ఆ టైటిల్ ని కంటిన్యూ అయ్యాడు. దీనిపై మారుతి స్పందిస్తూ. ఆయన చెప్పుతో కొట్టుకోవడం నాకు చాలా బాధగా అనిపించింది. టైటిల్ గురించి నేను కూడా చాలా సార్లు చెప్పాను. ఆయన చాలా మంచి సినిమా చేశాడు. అయితే సినిమా అని చూడమని ప్రేక్షకులను థియేటర్కు రప్పించడానికి చాలా దిగజారుడు పనులు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అంటూ మారుతి పలు ఉదాహరణలు చెప్పాడు.
Also Read: Rajinikanth: బాలును ఇళయరాజ పాడొద్దన్నారు, కానీ.. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నారు