Ind vs Pak Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో ( Asia Cup 2025 tournament ) భాగంగా… ఇవాళ దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా దుమ్ము లేపింది. పహాల్గం ప్రాంతంలో జరిగిన మారణకాండ కు ప్రతి కారం తీసుకొని టీమిండియా. పాకిస్తాన్ జట్టును దుబాయ్ వేదికగా చిత్తు చిత్తు చేసింది టీమిండియా. ఇవాల్టి మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమ్ ఇండియా. తక్కువ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచడంతో… అవలీలగా చేదించగలిగారు భారత బ్యాటర్లు. మొదట్లో ఓపెనర్ అభిషేక్ శర్మ మెరువగా.. చివరలో సూర్య కుమార్ యాదవ్ రఫాడించారు. కేవలం 15.5 ఓవర్లలోనే పాకిస్థాన్ విధించిన 128 లక్ష్యాన్ని ఛేదించింది సూర్య కుమార్ యాదవ్ సేన. చివరలో సిక్సర్ తో మ్యాచ్ ఫినీష్ చేశాడు సూర్య భాయ్. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
Also Read: Watch Video : పూజలు మానేసి…క్రికెట్ లోకి వచ్చేస్తున్న పూజార్లు…సిక్సులతో దుమ్ములేపారు !
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్. ఈ సందర్భంగా భారత బౌలర్ల ధాటికి అతి తక్కువ పరుగులు మాత్రమే చేసింది పాకిస్తాన్. నిర్ణీత 20 ఓవర్లలో… ఏకంగా తొమ్మిది వికెట్లు నష్టపోయి 127 పరుగులు మాత్రమే చేసింది. టి20 లో కనీసం 200 పరుగులు చేస్తేనే విజయం సాధించాలన్న నేపథ్యంలో…. కేవలం 127 పరుగులు చేసేందుకు నాన కష్టాలు పడింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఒక్కడే 44 బంతుల్లో నలభై పరుగులు చేయగా… చివరలో షాహిన్ అఫ్రిది మెరిశాడు. అతను 200 స్ట్రైక్ రేటుతో 33 పరుగులు చేసి రఫ్పాడించాడు. బుమ్రా బౌలింగ్లో కూడా సిక్సులు కొట్టాడు. అటు భారత బౌలింగ్ విషయానికి వస్తే.. చైనా మ్యాన్ కుల్దీప్ యాదవ్ కు ( Kuldeep yadav) మూడు వికెట్లు పడ్డాయి. అలాగే బుమ్రాకు రెండు వికెట్లు పడగా అక్షర పటే ల్ కి కూడా రెండు వికెట్లు పడ్డాయి. అటు హార్దిక్ పాండ్యాకు ఒక వికెట్ పడగా వరుణ్ చక్రవర్తి మరొకటి తీసుకున్నాడు. ( Team India vs Pakistan )
దుబాయ్ వేదికగా పాకిస్తాన్ జట్టును దారుణంగా ఓడించిన.. టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తుంది. పాకిస్తాన్లో దారుణంగా ఓడించి పహల్గా సంఘటనపై ప్రతికారం తీర్చుకుందని అంటున్నారు. వందమందికి పైగా ఉగ్రవాదులను భారత ఆర్మీ చంపేస్తే… ఇప్పుడు దుబాయిలో పాకిస్తాన్ క్రికెట్ టీం ను టీమిండియా ఓడించిందని మెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్ జట్టుపై టీమిండియా అద్భుతంగా ఆడిందని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇలాగే ఆడేసి… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలవాలని కోరుతున్నారు. ఇక అంతకు ముందు టాస్ సమయంలో…. పాకిస్థాన్ అలాగే.. టీమిండియా కెప్టెన్లు ఇద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు.
Also Read: Grace Hayden : దయచేసి ఆ పని చెయ్… లేకపోతే నగ్న***గా తిరగాల్సి వస్తుంది… హెడెన్ కూతురు ఎమోషనల్
Team India's captain Suryakumar Yadav refused the customary handshake with Pakistan captain Salman Ali Agha.#AsiaCup2025 #INDvsPAK #SuryakumarYadav #InsideSport #CricketTwitter pic.twitter.com/kQ6yoBgkND
— InsideSport (@InsideSportIND) September 14, 2025