Bigg Boss Telugu : బుల్లితెరపై టాప్ రియాలిటీ షో గా కొనసాగుతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఈ షో ప్రతి ఏడాది ప్రసారమవుతుంది.. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే కేవలం బాలీవుడ్ లో మాత్రమే 19 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో తొమ్మిదవ సీజన్ ప్రసారమవుతుంది. ఈ సీజన్ దాదాపు ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ పూర్తి కాబోతుంది.. ఈ సీజన్ కు కూడా గత సీజన్ లాగే కన్నడ వాళ్లే విన్నర్ గా నిలుస్తారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇదిలా ఉండగా సినిమా హీరో, హీరోయిన్లు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది..? ఆ సీజన్ కు హోస్ట్ గా రామ్ గోపాల్ వర్మ హోస్ట్ గా చేస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహ చాలా బాగుంది కదూ.. సెలబ్రిటీలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అందులో ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారో ఒక్కసారి చూసేద్దాం..
ప్రస్తుతం టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.. ఈ బిగ్ బాస్ షో ప్రతి ఏడాది ప్రసారం అవుతుంది.. గత ఎనిమిదేళ్లగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ ఏడాది సీజన్ కొన్ని రోజుల్లో పూర్తి కావొస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పై మీమ్స్, ఏఐ క్రియేషన్ తో వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి సినీ హీరోలు, హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినట్లు ఓ ఏఐ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో హోస్ట్ గా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కనిపించగా.. బాలయ్య, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేష్, కాజల్, అనుష్క, త్రిష, వంటి పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లు కనిపిస్తున్నారు. వీరితో పాటుగా బ్రహ్మానందం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తాడు. అందరు కూడా మాములుగా కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో అలా ఆ వీడియోలో కనిపిస్తారు.. బాలయ్య మాత్రం బిగ్ బాస్ పై ఫైర్ అవుతాడు. మొత్తానికి ఈ ఏఐ బిగ్ బాస్ వీడియో జనాలను బాగా ఆకట్టుకుంటుంది..
సెలబ్రెటీ బిగ్ బాసా… ఇదేప్పుడు పెట్టారు.. #RGV #Chiranjeevi #Balakrishna #Nagarjuna #MaheshBabu #JrNTR #AlluArjun #Venkatesh pic.twitter.com/yFTSlU0KcI
— Megha (@MovieloverMegha) December 10, 2025
Also Read : బిగ్ బాస్ హౌస్ లో మూడో యుద్ధం.. ఇదేం టాస్క్ రా అయ్యా.. డిమాన్ పై భరణి సీరియస్..
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 ప్రసారం అవుతుంది.. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఈ వారం 14 వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం లాగా ఈ వారం నామినేషన్స్ పెట్టకుండా హౌస్ మెట్స్ తో యుద్ధం చేపిస్తున్నాడు బిగ్ బాస్. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఈవారం ఏ కంటెంట్ అయితే టాప్ నెంబర్ లో ఉంటారో వాళ్లు టాప్ 5 ఉంటారు. మిగిలిన వాళ్లంతా కూడా ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు.. ప్రస్తుతం హౌస్ లో మూడో యుద్ధం కొనసాగుతుంది.. ఈవారం చివరికల్లా ఏ కంటెస్టెంట్ టాప్ నెంబర్ లో ఉంటారు? మరి ఏ కంటెంట్ లీస్ట్ స్కోర్ తో ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తాడు చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ వారం బిగ్ బాస్ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతుంది.. ఫైనల్ గా విన్నర్ ఎవరో అవుతారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు..