Bigg Boss Yashmi Gowda.. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఊహించని జంటలు కూడా పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.. అందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కన్నడ బ్యూటీ యష్మీ గౌడ (Yashmi Gowda) కూడా ఒకరు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈమె.. తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఆట మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యింది. దాదాపు 12 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఈమె.. ఈ హౌస్ లో ఉన్నన్ని రోజులు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అంతే కాదు ఈ సీజన్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ కూడా ఈమె కావడం గమనార్హం. సుమారుగా వారానికి రూ. 2.50లక్షల వరకు పారితోషకం తీసుకుంది యష్మీ గౌడ.
Anurag Kashyap: బాలీవుడ్ పూర్తిగా చెడిపోయింది.. అందుకే టాలీవుడ్ పయనం అంటున్న డైరెక్టర్..!
హల్దీ వేడుకల్లో హల్చల్ చేసిన యష్మీ గౌడ..
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ప్రస్తుతం టీవీ షోలు, సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా యష్మీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో పెళ్లికూతురిలా ముస్తాబైన ఈ ముద్దుగుమ్మ.. ముఖానికి పసుపు రాసుకొని, మంగళ స్నానం చేస్తూ కనిపించి అభిమానులకు సడన్గా షాక్ ఇచ్చింది. ఇదేంటి యష్మీ ఇంత సడన్గా పెళ్లి చేసుకుంటోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. అంతేకాదు ఆ వరుడు ఎవరు? ఇప్పటివరకు బయటపడని ఈమె సడన్గా పెళ్లి చేసుకుంటూ ఉండడం ఏంటి? ఇది పెద్దలు కుదిర్చిన వివాహమా? అంటూ కూడా కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు
రియల్ పెళ్లి కాదు రీల్ పెళ్లి..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఇది రియల్ పెళ్లి కాదు. రీల్ పెళ్లి అని తెలుస్తోంది. ఏదో సీరియల్ లోని ఒక సీన్ కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రియల్ పెళ్లి అనుకున్న నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయినా..అసలు విషయం తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా యష్మీ గౌడకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఎటువంటి హింట్ లేకుండా సడన్గా పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలియడంతో ఆశ్చర్యపోయారు. కానీ ఇది నిజం కాదు అని తెలుసుకొని కాస్త రిలీఫ్ అవుతున్నారని చెప్పవచ్చు ..ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈమె నిఖిల్ ని ప్రేమించింది . కానీ అక్కడే అసలు విషయం తెలుసుకొని అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఇప్పుడు మళ్లీ అంతలోనే పెళ్లి అనేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.