Hyderabad: హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మార్చి 8న నీటి సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగా గమనించగలరు. ముందు రోజు నీటిని పొదుపు చేసుకోగలరు. ఇదేమీ తాగునీటి సమస్య అస్సలే కాదు. ఎందుకంటే పైపులైన్లు మార్చడం వల్ల అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని నీటి వినియోగదారులు గమనించగలరు.
మార్చి 8న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా BHEL జంక్షన్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మిస్తోంది.
NHAI అభ్యర్థన మేరకు అక్కడ ఉన్న నీటి సరఫరా పైప్‌లైన్‌ను వేరే ప్రదేశానికి మార్చనున్నారు. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రభావిత ప్రాంతాలైన ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఆర్‌సీ పురం ప్రాంతాలు ఉన్నాయి.
వీటితోపాటు అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తిశ్రీనగర్, బీరంగూడ, అమీన్‌పూర్, నిజాంపేట్ వంటివి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచన చేసింది. జలమండలి చేసిన ప్రకటనను ప్రజలు దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోగలరు.
ALSO READ: భానుడి ప్రతాపం.. మార్చి సెకండ్ వీక్ నుంచి నిర్ణయం
స్వల్పంగా పెరిగిన భూగర్భ జలాలు
మరోవైపు రాష్ట్రంలో భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.68 మీటర్లు మేరకు ఉన్నట్లు అంచనా వేసింది ఆ శాఖ. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 0.02 శాతం సగటు పెరుగుదల నమోదు అయినట్టు భూగర్భ జల శాఖ వెల్లడించింది. 15 జిల్లాల్లో పెరుగుదల కనిపించింది. 18 జిల్లాల్లో పతనమైనట్టు తెలుస్తోంది. నిర్మల్‌లో కనిష్టంగా 0.04 శాతం, సూర్యాపేట్‌లో గరిష్టంగా 2.31 మీటర్లు పెరిగింది. తగ్గుదలలో కామారెడ్డి 0.05 శాతం నుంచి పడిపోయింది.