Anurag Kashyap.. ఒకప్పుడు టాలీవుడ్ నటీనటులకు బాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వాలి అంటే ఇష్టం చూపేవారు కాదు. ముఖ్యంగా సౌత్ నటీనటులు అంటేనే ఒక వర్గం అన్నట్టుగా పక్కన పెట్టేవారని, ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలు కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి తెలుగు పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే బాలీవుడ్ కాదు కదా ఇప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తెలుగులో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) బాలీవుడ్ పరిశ్రమపై విమర్శలు గుప్పిస్తూ టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించారు. అందులో భాగంగానే బాలీవుడ్ సినీ పరిశ్రమ గురించి అక్కడి వ్యక్తుల గురించి తెలిపారు అనురాగ్ కశ్యప్.
బాలీవుడ్ విషపూరితంగా మారింది..
సినీ నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. “నేను ముంబైని విడిచిపెట్టాను.. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా వ్యక్తులకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. హిందీ పరిశ్రమ చాలా విషపూరితంగా మారింది. ప్రతి ఒక్కరూ అవాస్తవిక లక్ష్యాలను వెంబడిస్తున్నారు, తదుపరి ₹500 – ₹800 కోట్ల చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా అక్కడ సృజనాత్మక వాతావరణం పోయింది, అందుకే ఇకపై బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉండాలని అనుకోవట్లేదు అంటూ అనురాగ్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
సౌత్ సినిమాలపై దృష్టి పెట్టిన అనురాగ్ కశ్యప్..
ఇకపోతే ఒకప్పుడు డైరెక్టర్గా వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్న అనురాగ్.. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ‘మహారాజా’ లో తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక ఆ క్లైమాక్స్ అంతలా పండడానికి అనురాగ్ తన నటన మార్క్ చూపించారు. ఇక ఇటీవలే మలయాళంలో ‘రైఫిల్ క్లబ్’ అనే సినిమాలో కూడా ఒక కీలకపాత్ర చేశారు అనురాగ్.
అడివిశేష్ ‘డెకాయిట్’ లో కీలక పాత్ర..
తాజాగా అడివి శేష్ (Adivi Shesh) డెకాయిట్ (Decoit) సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆయన నేరుగా చేస్తున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా పరిచయం ఉన్నవారికి అనురాగ్ కశ్యప్ ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారంటే అందులో తప్పకుండా ఒక విషయం ఉంటుందనే నమ్మకం కూడా ఉంటుంది. మరి తెలుగు ఆడియన్స్ ను ఆయన ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.
అనురాగ్ సినిమా కెరియర్..
దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, నటుడిగా పేరు దక్కించుకున్న అనురాగ్ కశ్యప్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించి, మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన 1997లో ఆర్తి బజాజ్ (Arti bazaz) ను వివాహం చేసుకోగా ..2009లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2011లో కల్కి కొచ్లిన్ (Kalki Kochlin) ను వివాహం చేసుకొని, 2015లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఇక ఈయనకు ఆలియా కశ్యప్ (Alia kashyap)అనే ఒక కూతురు కూడా ఉంది. అంతేకాదు అభినవ్ కశ్యప్ (Abhinav Kashyap) అనే సోదరుడు కూడా ఉన్నారు.
Film industry: తొడల మధ్యలో హీరోయిన్ రన్యా గోల్డ్ స్మగ్లింగ్.. తండ్రి డీజీపీ రియాక్షన్ ఇదే..!