BigTV English

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Type 5 Diabetes: సాధారణంగా మనం వినే డయాబెటిస్ రకాలు టైప్-1, టైప్-2. అయితే.. ఇటీవలి కాలంలో ప్రపంచానికి మరో కొత్త ముప్పుగా “టైప్-5 డయాబెటిస్” గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని “పోషకాహార లోపం సంబంధిత మధుమేహం” అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధికి కారణాలు. అది ఎవరిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా దీని ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


టైప్-5 డయాబెటిస్ అంటే ఏమిటి ?

సాధారణ డయాబెటిస్‌కు ఇది పూర్తిగా భిన్నమైనది. ఇది ముఖ్యంగా దీర్ఘకాలిక పోషకాహార లోపం కారణంగా వస్తుంది. ముఖ్యంగా చిన్ననాటి నుంచి పోషకాల కొరతతో బాధపడే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్థితిలో.. క్లోమం (pancreas) సరిగా పనిచేయదు. దాని ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది టైప్-1 డయాబెటిస్‌తో కొన్ని లక్షణాలను పంచుకున్నప్పటికీ.. దాని జన్యు లేదా ఆటోఇమ్యూన్ కారణాలు దీనికి ఉండవు. టైప్-2 డయాబెటిస్ ఎక్కువగా స్థూలకాయం ఉన్నవారిలో వస్తే.. టైప్-5 డయాబెటిస్ బరువు తక్కువగా ఉండే.. సన్నగా ఉన్న యువకులలో పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది.


ఎన్ని కేసులు నమోదయ్యాయి ?

అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 25 మిలియన్ల మంది ఈ రకం డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. చాలా సందర్భాలలో.. దీనిని టైప్-1 లేదా టైప్-2 డయాబెటిస్‌గా నిర్ధారించారు. దీనివల్ల సరైన చికిత్స అందక రోగులు మరింత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ కొత్త రకాన్ని అధికారికంగా గుర్తించడంతో.. దానిపై మరింత పరిశోధనలు, నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం ?
పోషకాహార లోపం ఉన్నవారు: ముఖ్యంగా చిన్ననాటి నుంచి సరైన పోషకాలు లభించని పిల్లలు, యువకులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. బీదరికం, ఆరోగ్య సేవలు సరిగా అందుబాటులో లేని ప్రాంతాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.

తక్కువ ఆదాయ దేశాలు: ఆసియా, ఆఫ్రికాలోని తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఇది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. ఈ ప్రాంతాల్లో పోషకాహార లోపం సర్వసాధారణం కాబట్టి.. ఈ రకం డయాబెటిస్ ఎక్కువగా కనిపిస్తుంది.

సన్నగా, బరువు తక్కువగా ఉన్నవారు: టైప్-2 డయాబెటిస్‌లా కాకుండా.. ఇది సన్నగా ఉండే వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వారి బాడీ మాస్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.

గర్భంలో పోషకాహార లోపం ఎదుర్కొన్న శిశువులు: తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరైన పోషకాలు అందకపోయినా.. శిశువులలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Also Read: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

వ్యాధి లక్షణాలు:
ఈ రకం డయాబెటిస్ లక్షణాలు టైప్-1, టైప్-2 డయాబెటిస్‌లతో చాలా వరకు పోలి ఉంటాయి. వాటిలో కొన్ని:

అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన.

అకారణంగా బరువు తగ్గడం.

విపరీతమైన అలసట, నీరసం.

గాయాలు ఆలస్యంగా మానడం.

చాలా సన్నగా ఉండి కూడా రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు ఉండటం.

చికిత్స, నివారణ:
టైప్-5 డయాబెటిస్ చికిత్సలో కేవలం మందులు లేదా ఇన్సులిన్ మాత్రమే కాకుండా.. పోషకాహార లోపాన్ని సరిచేయడం కూడా చాలా ముఖ్యం. తగినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఇతర అవసరమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో.. మందులు లేదా ఇన్సులిన్ అవసరం కావచ్చు.

ఈ కొత్త గుర్తింపుతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థలు,ప్రభుత్వాలు పోషకాహార లోపాన్ని నివారించడానికి, తక్కువ ఆదాయ దేశాలలో ప్రజలకు మెరుగైన ఆహారం, వైద్య సదుపాయాలు అందించడానికి చర్యలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Related News

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Big Stories

×