BigTV English

Bigg Boss 8 Telugu : దీపావళి రోజున అందరిని ఏడ్పించేసారుగా… ముగ్గులకు బిగ్ బాస్ ఫిదా..

Bigg Boss 8 Telugu : దీపావళి రోజున అందరిని ఏడ్పించేసారుగా… ముగ్గులకు బిగ్ బాస్ ఫిదా..

Bigg Boss 8 Telugu: వరల్డ్ టాప్ మోస్ట్ రియాలిటీ బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ షోకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది.. హౌస్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టంట్స్ కావడంతో అందరు ఎవరికీ వారే తమను ఎవరు నామినేట్ చెయ్యకూడదు అని గట్టి పోటీని ఇస్తారు. కానీ చివరకు జనాల ఓటింగ్ వల్ల హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక హౌస్ ఫ్రైడే ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంది.. మెగా చీఫ్ కోసం ఎవరికీ వారే అన్నట్లు బాగానే పోటీ పడ్డారు. కానీ మెగా చీఫ్ గా ముక్కు అవినాష్ నిలిచాడు. నబీల్ త్యాగమే ఇప్పుడు అలా అవినాష్ కు ఛాన్స్ వచ్చేలా చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హౌస్ లో దీపావళి సంబరాలు జరిగాయి. హౌస్ మేట్స్ ను ఎమోషనల్ అయ్యేలా చేసి ఏడ్పించేసారు..


దీపావళి సందర్బంగా హౌస్ లోని వాళ్ళు చాలా అందంగా ముస్తాబు అయ్యారు. ఇక తమ అల్లరితో కాసేపు సరదాగా ఉన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్ గ్రాండ్‌గా జరిగింది. అమ్మాయిలు-అబ్బాయిలను రెండు టీమ్‌లుగా విభజించి ముగ్గుల పోటీ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో అబ్బాయిలు కూడా అదిరిపోయేలా ముగ్గు వేశారు.. ఇద్దరి ముగ్గులకు బిగ్ బాస్ ఫిదా అయ్యారు. చాలా అందంగా వేశారు. ఇక బిగ్ బాస్ దీపావళికి స్వీట్స్ పంపిస్తాడు. ఆ స్వీట్స్ ను అందరు పంచుకొని తిని సంతోషంగా ఉంటారు. ఇక ఆ సంతోషాన్ని బిగ్ బాస్ ఎక్కువ సేపు ఉంచలేదు.. అప్పుడే అందరిని ఏడ్పించారు..

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు” అంటూ హరితేజ పాట అందుకుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్లు అందరూ చక్కగా రెడీ అయిపోయి దేవుడు ముందు కూర్చున్నారు. దీపావళి సందర్భంగా కంటెస్టెంట్లు అందరూ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. ఇక తర్వాత అందరూ ప్రసాదం తిని విషెస్ చెప్పుకున్నారు. మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా అబ్బయిలు-అమ్మాయిలకి బిగ్‌బాస్ రంగోలి వేసే అవకాశం ఇచ్చాడు.. ఎపిసోడ్ కు ఇదే బాగా హైలెట్ అయ్యింది.. ఆ తర్వాత అందరూ కలిసి గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ చేశారు. ఇక పృథ్వీకి మ్యాచింగ్‌గా డ్రెస్ వేసిన విష్ణుప్రియ మాములు హడావిడి చేయలేదు. పృథ్వీతో కలిసి డ్యాన్స్ చేసింది.


ఇక మెగా చీఫ్ టాస్కు సగమే చూపించాడు బిగ్‌బాస్. నిన్న ఎపిసోడ్ అయ్యేసరికి హరితేజ, టేస్టీ తేజ ఇద్దరూ మెగా చీఫ్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో అవినాష్, నిఖిల్, ప్రేరణ, నబీల్ ఇంకా రేసులో కొనసాగుతున్నారు. వీరి మధ్యలో టాస్కు ఎలా జరిగిందో ఈరోజు ఎపిసోడ్‌లో చూపించారు . అయితే ఇప్పటికే అవినాష్ మెగా చీఫ్ గా అయ్యాడు.. దాంతో ఎపిసోడ్ ఆసక్తిగా మారుతుంది. ఇక దీపావళి సందర్బంగా ఇంట్లో వాళ్ళ వీడియోలను చూపించారు బిగ్ బాస్.. అందరు తమ వాళ్ళను తలచుకొని ఏడ్చేశారు. సరదాగా, గొడవలు, ఎమోషనల్ గా నిన్నటి ఎపిసోడ్ పూర్తి అయ్యింది. ఇక ఈరోజు వీకెండ్ కదా ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..

Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×