BigTV English
Advertisement

KTR Padayatra: ఆధిపత్యం కోసమేనా పాదయాత్ర? హరీష్‌ను తొక్కి.. నేనే సీఎం అని చెప్పేందుకేనా?

KTR Padayatra: ఆధిపత్యం కోసమేనా పాదయాత్ర? హరీష్‌ను తొక్కి.. నేనే సీఎం అని చెప్పేందుకేనా?

⦿ పాదయాత్రకు సిద్ధమైన కేటీఆర్
⦿ ఈ సడెన్ ట్విస్ట్ వెనుక కారణాలేంటి?
⦿ పార్టీని త్వరగా చేతుల్లోకి తీసుకోవాలనే వ్యూహమా?
⦿ హరీష్ రావును ముందే తొక్కి పెట్టే ప్లానా?
⦿ నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అని చెప్పే ప్రయత్నమా?
⦿ కేసీఆర్ నెక్స్ట్ ఎలక్షన్‌కు యాక్టివ్‌గా ఉండరా?
⦿ అంతా కేటీఆర్ చేతుల్లోకి వెళ్తే హరీష్ రావు సైలెంట్‌గా ఉంటారా? వైలెంట్‌గా రియాక్ట్ అవుతారా?
⦿ బీఆర్ఎస్‌లో పాదయాత్ర ప్రకంపనలు


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: పాదయాత్ర.. ఇది పాదాలతో చేసే యాత్ర. అప్పుడెప్పుడో వైఎస్ షర్మిల చేసిన ఈ కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఇది ఎంత ఫన్నీగా ఉన్నా, పాదయాత్ర చూపించే ఇంపాక్ట్ సాలిడ్‌గా ఉంటుంది. గతంలో చాలామంది ఈ పాదయాత్ర ఫార్ములాని వాడేశారు. కానీ, సరైన టైమ్‌లో వాడి సక్సెస్ అయినవాళ్లు కొందరే. పాదయాత్ర చేద్దాం అని అనుకుంటే సరిపోదు. దానికి అన్ని రకాల తోడ్పాటు, సరైన సమయం ఉండాలి. లేకపోతే, ఎన్ని వేల అడుగులు వేసినా, ఎన్ని కిలోమీటర్లు నడిచినా వేస్ట్. మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో, ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. దగ్గరలో ఎన్నికలు లేవు. ఇలాంటి సమయంలో ఈ డెసిషన్‌కు కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న చుట్టూ అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి.


కేసీఆర్ మౌనం.. కేడర్‌లో నిస్తేజం

తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని ఏలింది బీఆర్ఎస్. అన్నేళ్ల పాలన చూశాక జనానికి విసుగు రాకుండా ఉంటుందా? చెప్పిన మాటలే చెబుతూ ఉండడంతో, మీ సేవలు ఇక చాలు అంటూ 2023 ఎన్నికల్లో పక్కన పెట్టేశారు ప్రజలు. కేసీఆర్ అయితే రెండు చోట్ల పోటీ చేయాల్సి వచ్చింది. అందులోనూ ఒకచోట ఓటమి చవిచూశారు. దీంతో ఇంటికే పరిమితమయ్యారు కేసీఆర్. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, ఉపయోగం లేకుండా పోయింది. ఓట్ షేర్ ఇంకాస్త తగ్గిపోయింది. సీట్లు చూస్తే గుడ్డు సున్నా దక్కింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత నిస్తేజం నెలకొంది. కేసీఆర్ బయటకు రావడమే మానేశారు. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లలేదు. ఒకరోజు మాత్రం తప్పనిసరి వెళ్లాల్సి హాజరు వేయించుకుని వచ్చారు. తర్వాత మళ్లీ షరా మామూలే. కేటీఆర్, హరీష్ రావు ఆ ధర్నా ఈ ధర్నా అంటూ హడావుడి చేస్తున్నా ఉపయోగం ఉండడం లేదు. పార్టీలో ఎలాంటి మార్పు రావడం లేదు. దీంతో కేడర్‌లో ఉత్సాహం మరింత నీరుగారిపోతోంది.

పాదయాత్ర ప్రకటన.. డబుల్ ప్లాన్

తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలు పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. కేటీఆర్ కూడా అదే ప్లాన్‌ను వర్కవుట్ చేయాలని చూస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా, అటు కేడర్‌లో ఉత్సాహం, ఇటు కేసీఆర్ తర్వాత తానేనన్న సంకేతం చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పార్టీలో చాలా రోజులుగా నెంబర్ 2 రచ్చ జరుగుతోంది. మొదట్నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న హరీష్ రావు పార్టీలో పట్టు సాధించారు. కేసీఆర్ తర్వాత ఆయనే అన్నట్టుగా చాలాకాలం చర్చ సాగింది. అయితే, కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌నే ప్రమోట్ చేస్తూ వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చి కేటీఆర్ తర్వాతే హరీష్ అన్న సంకేతాన్ని కేడర్‌కు పంపారు. కానీ, హరీష్ అంత మాస్ ఫాలోయింగ్‌ కేటీఆర్ సాధించలేకపోయారు. పైగా, కేసీఆర్ సైలెంట్ అయిన దగ్గర నుంచి హరీష్ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ చిన్న విషయంపై రియాక్ట్ అవుతూ, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒక్కోసారి డైరెక్ట్‌గా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నారు. ఇది కేటీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. అందుకే, పాదయాత్రతో అటు కేడర్‌ను, ఇటు తన ఆధిపత్యాన్ని చూపించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: మూసీ పునరుజ్జీవనం, మెత్తబడిన విపక్షాలు.. రేపో మాపో టెండర్లు

కేసీఆర్ సంకేతాలు ఇచ్చారా?

కేసీఆర్ బహుశా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ప్రచారం జరుగుతోంది. కేవలం, పరోక్ష సహకారం మాత్రమే అందిస్తారని అంటున్నారు. దీనిపై చర్చ జరిగాకే కేటీఆర్ పాదయాత్ర ప్రకటన చేసి ఉంటారని తెగ మాట్లాడుకుంటున్నారు. అంటే, నెక్ట్స్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేలా ఫోకస్ అయ్యేందుకు పాదయాత్ర దోహదపడుతుందని, కారు పార్టీ మొత్తం తన గ్రిప్‌లోకి వస్తుందని భావించే పాదాల యాత్రకు దిగుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. 2027లో జమిలీ ఎన్నికలు ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఎంత వీలుంటే అంత త్వరగా పాదయాత్ర మొదలుపెట్టి, పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని కేటీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే, ఇదే జరిగితే హరీష్ రావు సైలెంట్‌గా ఉంటారా? వైలెంట్‌గా రియాక్ట్ అవుతారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Related News

CM Revanth Reddy: కేటీఆర్‌ను శ్రీలీల ఐటెం సాంగ్‌తో పోల్చి.. పరువు తీసిన రేవంత్

Kavitha: పాలిటిక్స్ ‘వర్సెస్’ పర్సనల్.. కవిత సంచలన కామెంట్స్, ఆ పార్టీతో చర్చలు.. చర్చించడాలు లేవ్

Bandi Sanjay: జూబ్లిహిల్స్ పేరు మారుస్తాం: బండి సంజయ్

Jubill Hill bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. గోపీనాథ్ మరణం, ఆరునెలల తర్వాత గుర్తొంచిందా?కేటీఆర్ ఫైర్

Bhadradri Kothagudem News: అదృష్టంగా భావిస్తున్నాం-ఎమ్మెల్యే పాయం.. తెలంగాణలో మొదలైన 69వ రాష్ట్ర స్థాయి క్రీడలు

Hyderabad Drug Case: కాలేజీలే అడ్డాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా.. ఈగల్ టీమ్ దాడులు

CM Progress Report: తమాషాలు చేస్తే తాట తీస్తా.. ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో కనిపించని కేసీఆర్, కేడర్‌లో అనుమానాలు, నెక్ట్స్ ఏంటి?

Big Stories

×