E-Paper
Advertisement

MGNREGA Days Hike: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. పనిదినాలు పెంచిన కేంద్రం

MGNREGA Days Hike: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. పనిదినాలు పెంచిన కేంద్రం
Advertisement

MGNREGA Days Hike: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును కేంద్రం మార్చింది. ఉపాధి హామీ పేరును ‘పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్ యోజన’గా మారుస్తూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే ఉపాధి హామీ పనిదినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కు పెంచింది.

కేంద్ర ప్రభుత్వం 2006 ఫిబ్రవరిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కార్యక్రమాన్ని ప్రారభించింది. గ్రామాల్లో శ్రామికులకు సంవత్సరంలో కనీసం వంద రోజులపాటు పని కల్పించాలని నిర్ణయించింది. డిసెంబర్ 12న కేంద్ర ప్రభుత్వం MGNREGA పేరు మార్పును ఆమోదించింది.

125 రోజులకు పెంపు

Advertisement

కనీస ఉపాధి రోజుల సంఖ్యను 125 రోజులకు పెంచింది. అంతేకాకుండా, కనీస వేతనాన్ని రోజుకు రూ. 240కి సవరించింది. ఈ పథకాన్ని మొదటిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA) పేరుతో ప్రారంభించారు. తరువాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)గా పేరు మార్చారు. సామాజిక భద్రతలో భాగంగా ‘పని హక్కు’ హామీ ఇస్తున్న కార్మిక చట్టం.

గ్రామీణ భారతదేశంలో నైపుణ్యం లేని వారి జీవనోపాధి భద్రతను పెంచడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. ప్రతి ఇంట్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏడాదిలో 100 రోజుల పని కల్పించాలి.

Advertisement

Also Read: PM WANI: ఉచిత ఇన్ స్టాలేషన్ తో రూ.150కే వైఫై.. పీఎం వాణి పథకం గురించి తెలుసా?

Tags

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×