BigTV English

Geethu Royal : ఎంతపని చేశావు గీతూ.. బన్నీ పరువు తీసేసావుగా.. ఫ్యాన్స్ ట్రోల్స్..

Geethu Royal : ఎంతపని చేశావు గీతూ.. బన్నీ పరువు తీసేసావుగా.. ఫ్యాన్స్ ట్రోల్స్..

Geethu Royal : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోలు కూడా ఉండడంతో ఈ సినిమాకు మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. ఎప్పటి నుంచో ఆకలి మీద ఉన్న పవన్ వీరాభిమానులు ఎంతో ఉత్కంఠగా థియేటర్లలో సినిమా చూశారు. అయితే వీరమల్లు పూర్తిగా వాళ్ల ఆకలిని అయితే తీర్చలేకపోయింది. ముఖ్యంగా పవన్ ఎంట్రీ సీన్, ఫస్టాఫ్, కొన్ని పోరాట సన్నివేశాలు బావున్నాయని కానీ రెండో భాగం పెద్దగా ఆకట్టుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఎలా కున్నారు సరే ఈ సినిమాకు మాత్రం రెస్పాన్స్ బాగుంది. కొంతమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకు రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లు గురించి బిగ్ బాస్ బ్యూటీ గీతూ రాయల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారింది.


వీరమల్లు పై గీతూ కామెంట్స్..

బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన గీతూ.. ఈమధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె హరిహర వీరమల్లు సినిమా చూసింది. సినిమా ఎలా ఉంది అన్న విషయాన్ని పంచుకుంది. ఫస్టాఫ్ అయితే చాలా చాలా బావుంది.. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నిసార్లు అయినా సినిమా చుడొచ్చు.. ఆయన చాలా అందంగా కనిపించారు.. ఆయన కళ్లల్లోనే ఏదో సూపర్ పవర్ ఉంది అనిపిస్తుంది. సినిమాల స్లోగా వెళ్ళిపోతుంది. నేను ఈ సినిమా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను అని గీతు అంటుంది. ఈమె మాట్లాడుతూ.. నేను నిజానికి అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్‌ని కానీ నేను ‘పెద్ది’ సినిమా కోసం పిచ్చిపిచ్చిగా వెయిట్ చేస్తున్నా.. ఓజీ కోసం కూడా వెయిట్ చేస్తున్నా.. అలానే వీరమల్లు సెకండ్ పార్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా.. అని అంటుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


గీతూ పై అల్లు అర్జున్ ట్రోల్స్.. 

గీతో మాటలు విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమెపై పీకలు దాకా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ వేయండి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తావా..? చూస్తే చూసావు గాని మళ్లీ అంతగా పొగిడేస్తున్నావ్ ఏంటి అంటూ కొందరు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.. అల్లు అర్జున్ సినిమాకి ఎప్పుడైనా నువ్వు ఎంతగా పొగిడావా? మా హీరో పరువు తీసేసావుగా.. ఇలా చేయడం మాకు బాధగా అనిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై గీతూ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. గీత తో పాటు ఈ సినిమాని బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య కూడా వీక్షించింది. వీరమల్లు పై ఆమె కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని ఇచ్చింది. వీళ్లే కాదు ఇక చాలామంది కూడా హరిహర వీరమల్లు సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ని ఇస్తున్నారు. మరి కలెక్షన్స్ ఏమాత్రం వస్తాయో చూడాలి…

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×