Singer Kanakavva: ఇటీవల కాలంలో ఫోక్ పాటలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ఫోక్ సింగర్స్ తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఫోక్ సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ కనకవ్వ (Kanakavva) ఒకరు. సింగర్ కనకవ్వ పేరు చెప్పగానే అందరికీ టక్కున నరసపల్లె అనే పాట గుర్తుకొస్తుంది. ఈ పాటతో ఎంతో ఫేమస్ అయిన కనకవ్వ పెద్ద ఎత్తున ఫోక్ సాంగ్స్ పాడుతూ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కనకవ్వ బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కామన్ మ్యాన్ ఎంట్రీ..
బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తొమ్మిదవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది. ఇక తొమ్మిదవ సీజన్లో ఈసారి కామన్ మ్యాన్(Common Man) కూడా ఉండబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కామన్ మ్యాన్ సెలక్షన్స్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో సింగర్ కనకవ్వ కూడా పాల్గొనబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.
గంగవ్వను ఫాలో అవుతున్న కనకవ్వ…
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కనకవ్వ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గంగవ్వ(Gangavva) లాగా మీకు బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా? అనే ప్రశ్న ఎదురు కావడంతో తప్పకుండా వెళ్తానని తెలియజేశారు. మరి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతో ఆసక్తి చూపుతున్న కనకవ్వకు బిగ్ బాస్ నిర్వాహకులు అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సింది. ఇక గంగవ్వ కూడా మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఫేమస్ అవ్వడమే కాకుండా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చదరంగం కాదు…రణరంగం
మొదటిసారి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న గంగవ్వ ఎక్కువ వారాలపాటు హౌస్ లో ఉండలేక అనారోగ్య సమస్యలకు గురి అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. తిరిగి ఈమె సీజన్ 8 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా గంగవ్వ రెండు సార్లు బిగ్ బాస్ లోకి వెళ్లి మరింత పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే కనకవ్వ కూడా గంగవ్వను ఫాలో అవుతూ బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సీజన్లో కాకపోయినా తదుపరి సీజన్లలో అయినా కనకవ్వకు బిగ్ బాస్ అవకాశం ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రోమోలు విడుదల చేశారు. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున(Nagarjuna) చెప్పే వ్యాఖ్యలు చూస్తుంటే ఈ సీజన్ చాలా విభిన్నంగా ప్లాన్ చేశారని స్పష్టం అవుతుంది.
Also Read: Saiyaara: ఛావా రికార్డులను బద్దలు కొట్టిన సైయారా…బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం!