saiyaara movie crosses chhaava film collection check more details
Saiyaara Movie: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనాలను సృష్టిస్తున్న సైయారా(Saiyaara) సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది.మోహిత్ సూరి దర్శకత్వంలో.. ఆహాన్ పాండే(Ahaan Pande), అనిత్ పడ్డా(Aneeth Padda) హీరో హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా జులై 18వ తేదీ ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమా చూసిన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఓవర్సీస్ లో ఛావాను బీట్ చేసిన సైయారా..
ఇప్పటికే ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంశల వర్షం కురిపించారు. ఈ సినిమాలో నటీనటులందరూ కొత్తవాళ్లు కావడంతో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాలను అందుకుంది. ఈ సినిమా విడుదలైన 13 రోజులకే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఛావా సినిమా ఓవర్సీస్ రికార్డులను కూడా చెరిపేసిందని చెప్పాలి. ఛావా సినిమా ఓవర్సీస్ లో 91 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
శంభాజీ మహారాజ్ జీవిత కథ…
ఛావా సినిమా(Chhaava Movie) చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న వంటి స్టార్ సెలబ్రిటీలు నటించారు. ఇక ఈ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సైయారా మరింత ఆదరణ సొంతం చేసుకొని ఈ సినిమా ఓవర్సీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఛావా ఓవర్సీస్ లో 91 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా సైయారా 94 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఆహాన్…
ఈ సినిమా కేవలం ఓవర్సీస్ లో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా ఇదే హవా కొనసాగిస్తే 500 కోట్ల కలెక్షన్లను సునాయాసంగా బీట్ చేస్తుందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా నిర్మాతలు భారీ స్థాయిలో లాభాలను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఆహాన్ పాండే స్వయాన బాలీవుడ్ నటి అనన్య పాండే సోదరుడనే సంగతి తెలిసిందే ఇది ఈయనకు మొదటి సినిమా కావటం విశేషం ఇలా మొదటి సినిమాతోనే సంచలనాలను సృష్టించారని చెప్పాలి. ఇలా థియేటర్లో ఎంతో విజయవంతమైన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ఓటీటీలోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అధికారక ప్రకటన రాకపోయినా ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Also Read: HBD Kiara Advani: కియారా బర్త్ డే స్పెషల్.. సిద్దార్థ్ తో ప్రేమ,పెళ్లి… ఆస్తుల విలువ ఎంతంటే?