E-Paper
Advertisement

Bigg Boss Telugu 8 : దిగజారుతున్న బిగ్ బాస్… ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసేంత వరకు..

Bigg Boss Telugu 8 : దిగజారుతున్న బిగ్ బాస్… ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసేంత వరకు..
Advertisement

Bigg Boss Telugu 8 : గ్ బాస్ అనే రియాలిటీ షో.. ఇది తెలుగులో స్టార్ట్ అయిన నాటి నుంచి వ్యతిరేకతనే. కొంత మంది యువతి యువకులను ఓ ఇంట్లో పెట్టి కొద్ది రోజుల పాటు వారితో గేమ్స్ ఆడించడం ఈ రియాలిటీ షోలో జరుగుతు ఉంటుంది. దీన్నే వ్యతిరేకిస్తున్నారు. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్. అలాగే కంటెస్టేంట్స్ మొహాలు కూడా చాలా మందికి తెలుసు. దీంతో అప్పటి ఫస్ట్ సీజన్ అంతా సాఫీగానే సాగింది. కానీ, తర్వాత వచ్చే సీజన్స్ లో మసాల ఘాటు పెంచుతూ వచ్చారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇక ఇప్పుడు జరుగుతున్న 8వ సీజన్ అయితే మరీ దిగజారిపోయింది.

నిన్నటి ఎపిసోడ్ చూస్తే హౌస్ లో ఎలాంటి పరిస్థితి ఉందో క్లిస్టర్ క్లీయర్ గా అర్థమవుతుంది. టాస్క్ అనే పేరుతో అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ ను అబ్బాయిలు టచ్ చేస్తూంటే, బిగ్ బాస్ సైలెంట్ గా ఉంటున్నాడు. సైలెంట్ గా ఉండటం అంటే, అక్కడ జరుగుతున్న దాన్ని ఎంకరైజ్ చేయడమేనా.. ? అనే అనుమానాలు రాక మానదు.

Advertisement

ఎగ్స్ పట్టుకోవడం టాస్క్ లో రెండు క్లాన్లు పోటీ పడ్డాయి. అయితే ఓ సందర్భంలో ఎగ్స్ కోసం కొట్టుకోవడంలో భాగంగా, పృథ్వీ అనే కంటెస్టెంట్… ప్రేరణ, యష్మీ లను బ్యాక్ నుంచి గట్టిగా పట్టుకుంటాడు. ఆ టైంలో పృథ్వి చేతులు ప్రేరణ ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ అయ్యేలా ఉంటుంది. అప్పుడు ప్రేరణ విడిచిపెట్టు అన్నా.. కూడా పృథ్వి ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఈ క్రమంలో వారి మధ్య చిన్న గొడవ కూడా జరుగుతుంది.

ఈ ఒక్క సందర్భంలోనే కాదు, టాస్క్ మొత్తం దాదాపు ఇలాంటివే కనిపించాయి. ఏదైన షో చూస్తే ఆడియన్ ఎంటర్ టైన్ అవ్వాలి. కానీ, బిగ్ బాస్ 8 లో నిన్నటి ఎపిసోడ్ చూస్తే మాత్రం ఆడియన్ కి వచ్చింది ఎంటర్ టైన్ మెంట్ కాదు.. ప్రస్టేషన్. చాలా మంది ఆడియన్స్ ఈ ఎపిసోడ్ ను మధ్యలో స్కిప్ కూడా చేశారు.

Advertisement

అలాగే ఫుడ్ కోసం టాస్క్ లు ఆడటం, అందుకు ఇతర కంటెస్టెంట్స్‌తో గొడవలు పడటం మరీ ఇబ్బందిగా కనిపిస్తుంది. అభయ్ అనే కంటెస్టెంట్ కూడా ఇదే రైజ్ చేశాడు. ఫుడ్ కోసం కొట్టుకోవడం ఏంటిరా.. మరీ సైకోలా తయారు అవుతున్నారు అంటూ బిగ్ బాస్ పై అభయ్ మండిపడ్డాడు. నిజానికి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చూసినా, కంటస్టెంట్స్ ఆడే విధానం చూసినా.. అప్పుడు బిగ్ బాస్ వ్యవహరిస్తున్న సైలెన్స్ ను చూసినా.. బిగ్ బాస్ ఓ సైకో అనకుండా ఉండలేం.

ఇప్పుడు బిగ్ బాస్ సైలెంట్ గా ఉన్నా.. శనివారం హోస్ట్ గా వచ్చే నాగార్జున దీనిపై నోరు తెరుస్తాడా..? ఇలాంటి వాటివి మళ్లీ జరగకుండా యాక్షన్ తీసుకుంటాడా..? అనేది చూడాలి. కానీ, బిగ్ బాస్ షో మాత్రం రోజు రోజుకు దిగజారిపోతుంది అనేది మాత్రం వాస్తవం.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×