BigTV English

Vishwambhara Release Date : చికెన్ గున్యా ఎఫెక్ట్… రిలీజ్ డేట్ మార్చుకుంటున్న చిరు, చరణ్..!

Vishwambhara Release Date : చికెన్ గున్యా ఎఫెక్ట్… రిలీజ్ డేట్ మార్చుకుంటున్న చిరు, చరణ్..!

Vishwambhara Release Date.. గత నెల రోజులుగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చికెన్ గున్యాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొమెంటో అందుకునే సమయంలో కూడా ఆయన అనారోగ్య సమస్యతోనే కనిపించారు. నడవలేని పరిస్థితుల్లో వుండడంతో.. చిరంజీవి చేయి పట్టుకొని స్టేజ్ పైకి తీసుకెళ్లారు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న కారణంగానే తన సినిమా విశ్వంభర విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్న చిరంజీవి..

నిజానికి విశ్వంభర సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సినిమా ప్రకటించిన రోజే చిత్ర బృందం వెల్లడించింది. దీంతో సంక్రాంతి రేసులో చిరంజీవి మూవీ ఉండబోతోందని అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సంక్రాంతి రేస్ నుంచి విశ్వంభర తప్పుకుందని సమాచారం. దీనికి కారణం చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడడమే. ముఖ్యంగా చికెన్ గున్యాతో బాధపడడం వల్లే షూటింగ్ కి దూరమయ్యారు. చికెన్ గున్యా కారణంగానే చిరంజీవి సెట్లో షూటింగ్ కి వెళ్లే పరిస్థితి లేదని సమాచారం. ఆయన పూర్తిగా కోల్పోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి సినిమా షూటింగ్ కి ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. అంతేకాదు ఒకవైపు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా జరుగుతోంది. కానీ అనుకున్న సమయానికి పూర్తి కావడం కూడా కష్టమని అర్థమవుతోంది. అందుకే విశ్వంభర సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీకి ఇంకా ఓటీటీ కూడా కాలేదు. ఓటీటీ సంస్థలు తక్కువ మొత్తానికి అడుగుతున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమాకి చాలా తక్కువ అమౌంట్ ఆఫర్ చేయడం వల్లే ఇంకా ఓటీటీ ఫిక్స్ కాలేదని సమాచారం. మొత్తానికైతే సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి మూవీ తప్పుకున్నట్లే అని తెలుస్తోంది.


ఆ స్థానాన్ని రామ్ చరణ్ భర్తీ చేయనున్నారా..

అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అక్టోబర్ 20వ తేదీన రావాల్సిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా వాయిదా పడినట్లు సమాచారం. మరోవైపు ఇటు దేశీయంగా, అటు ఓవర్సీస్ లో కూడా గట్టి పోటీ ఏర్పడిన నేపథ్యంలో ఈ డిసెంబర్ 20 కి సినిమా విడుదల చేయడం రిస్కుతో కూడుకున్న పని అని దిల్ రాజు భావించినట్లు ఉన్నారు. అందుకే ఈ సినిమాను సంక్రాంతి రేసులోకి దింపబోతున్నట్లు సమాచారం. అక్కడ చికెన్ గున్యా కారణంగా చిరంజీవి తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోవడంతో.. ఆ తేదీలలో రామ్ చరణ్ మూవీ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×