Inaya Sultana:ప్రస్తుత కాలంలో కొంతమంది సెలబ్రిటీలు పాపులారిటీ పొందడం కోసం సోషల్ మీడియాను ఫ్లాట్ ఫామ్ గా చేసుకున్నారు. అందులో భాగంగానే గ్లామర్డోస్ పెంచేసి తమ అందచందాలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు తమ రియల్ లైఫ్ లో జరిగే విషయాలను కూడా పంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో ఇనయా సుల్తానా (Inaya Sultana)కూడా ఒకరు.. ఇనయా సుల్తానా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)తో వీడియో చేసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. దాంతో సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ అయిపోయింది.
హార్ట్ బ్రోకెన్ అంటూ క్యాప్షన్..
ఎప్పటికప్పుడు యువతను ఆకట్టుకునేలా గ్లామర్ ఫోటోలను షేర్ చేసే ఈమె అందానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక తన అందాల ఆరబోతతో మాయ చేసే ఈ అమ్మడు తన ఫాలోవర్స్ ని రోజురోజుకు పెంచుకుంటుంది. మైమరిపించే స్టిల్స్ తో ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్న ఇనయా.. తాజాగా మిని బ్లాక్ స్కర్ట్ ధరించి అందాలతో చెమటలు పట్టించింది. ఇకపోతే వేడి పుట్టించే ఫోటోలు షేర్ చేసిన ఈమె దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చింది. “రెండు విషయాలను నేను మళ్లీ అనుభవించకూడదు అని కోరుకుంటున్నాను. అందులో ఒకటి హార్ట్ బ్రోకెన్, మరొకటి డీప్ లవ్” అంటూ క్యాప్షన్ జోడించింది.
ప్రేమలో పడ్డ ఇనయా సుల్తానా.. కానీ..
ఇది చూసిన నెటిజెన్స్ సరికొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇనయా సుల్తానా ఇలాంటి క్యాప్షన్ పెట్టడం వెనుక అసలు కారణం ఏంటి? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఇనయా సుల్తాను తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది. జిమ్ ట్రైనర్ గౌతమ్ కొప్పిశెట్టితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. అయితే సడన్గా మళ్లీ ఇలాంటి క్యాప్షన్ ఇవ్వడంతో.. కొంపతీసి బ్రేకప్ అయ్యిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి దేనిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాప్షన్ ఇచ్చిందో తెలియాల్సి ఉంది.
ఇనయా సుల్తానా కెరియర్..
ఇనయా సుల్తానా విషయానికి వస్తే.. మోడలింగ్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత మెల్లగా సినిమాలలో అవకాశాలు తలుపుతట్టాయి. ఏవం జగత్ సినిమాతో హీరోయిన్గా మారిన ఇనయా బుజ్జి ఇలారా, నటరత్నాలు, యద్భావం తద్భవతి వంటి సినిమాలలో నటించింది. అయితే ఏ సినిమా కూడా ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపును అందించలేదు. ఇక బిగ్ బాస్ తర్వాత అయినా ఈమెకు సినిమాలలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. దాంతో సినిమాల కోసం ఎదురు చూడకుండా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే పలు రకాల గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. ఏది ఏమైనా మరొక్కసారి అందాల బ్లాస్ట్ చేసేసింది ఇనయా సుల్తానా.