OnePlus Watch 3 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) త్వరలోనే వన్ ప్లస్ త్రీ వాచ్ 3 (OnePlus Watch 3) ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. తాజాగా ఈ వాచ్ కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. వన్ ప్లస్ వాచ్ 2 (OnePlus Watch 2) డిజైన్ తోనే ఈ కొత్త వాచ్ రాబోతున్నప్పటికీ లేటెస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఇప్పటికే లేటెస్ట్ ఫీచర్స్ తో అదిరిపోయే స్మార్ట్ వాచెస్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఆపిల్ వాచెస్ తో పాటు సాంసంగ్, వన్ ప్లస్ తమ సత్తా చాటాయి. ఇక ఆపిల్ వాచ్ త్వరలోనే మరో కొత్త సిరీస్ ను సైతం తీసుకురాబోతుంది. ఇందులో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో పాటు అదిరిపోయే అప్డేట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇక శాంసంగ్ తీసుకొచ్చిన వాచెస్ లో సైతం కాలింగ్, నోటిఫికేషన్స్ ఫీచర్స్ తో పాటు ఆత్యాధునిక బ్యాటరీ సదుపాయం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వన్ ప్లస్ రెండు వాచ్ సిరీస్ ను తీసుకురాగా.. ఇప్పుడు వన్ ప్లస్ వాచ్ 3 పేరుతో మరొక కొత్త సిరీస్ తీసుకురాబోతుంది.
వన్ ప్లస్ వాచ్ 3.. కొన్ని నెలలుగా టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న వాచ్. ఇప్పటికే వన్ ప్లస్ సిరీస్ లో వచ్చిన వాచెస్ వినియోగదారుల్ని ఆకట్టుకోగా.. ఈ వాచ్ మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. వన్ ప్లస్ వాచ్ 3 ఎన్నో అప్డేట్స్ ను సైతం తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్ సిరీస్ OnePlus 13, OnePlus 13R, OnePlus 13 బడ్స్ ప్రోలను జనవరి 7న లాంఛ్ చేయటానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే OnePlus వాచ్ 3ను కూడా లాంఛ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వాచ్ లాంఛ్ పై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ OnePlus నుండి కొత్త స్మార్ట్‌వాచ్ మాత్రం త్వరలోనే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.
OnePlus Watch 3 Features –
త్వరలోనే రాబోతున్న వన్ ప్లస్ వాచ్ 2 డిజైన్ వన్ ప్లస్ వాచ్ 3 మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. రోటరీ డయల్‌లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉందని… ఆపిల్ వాచ్‌లలో ఉన్నట్టు డిజిటల్ క్రౌన్ రాబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని స్పెసిఫికేషన్స్ తో రాబోతున్నట్టు సమాచారం. ఇక ఇందులో హార్ట్ బీట్ సెన్సార్ సూట్‌కు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) ఫీచర్‌ను సైతం ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ అని వన్ ప్లస్ చెప్పుకొస్తుంది. ఇందులో హార్ట్ బీట్ ను క్లియర్గా అంచనా వేసి చూపించే స్పెషల్ ఫీచర్స్ సైతం ఉండనున్నట్లు తెలుస్తుంది. OnePlus వాచ్ 3 LTE వేరియంట్‌తో రాబోతుంది. ఇందులో కాల్స్ తో పాటు నోటిఫికేషన్‌లను చూడటానికి సైతం అవకాసం ఉంటుంది. ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ W5 Gen 1 SoC తో పనిచేస్తుంది. ఇది 2GB RAM + 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో రాబోతుంది. ఇది Watch OS 5లో రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక 500mAh+ బ్యాటరీతో వచ్చేస్తుంది.
ALSO READ : రెడ్ మీ 14 ప్రో.. గుడ్ ఆర్ బ్యాడ్..!