Ram Charan Speech: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాంచరణ్ కంప్లీట్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఇది. ఇకపోతే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి పనిచేసిన సుకుమార్ నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుండి చాలామంది కొత్త దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యానర్ లో ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలకు పైగా విడుదలయ్యాయి. అంతేకాకుండా తమిళ్లో కూడా ఈ బ్యానర్ సినిమాలను నిర్మించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా చేసిన సినిమా వారసుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మొదటి నిర్మించిన తమిళ సినిమా ఇది. అయితే ఈ సినిమా ఈవెంట్ లో అప్పట్లో దిల్ రాజు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. సినిమాలో ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయో అని అప్పుడు తమిళ్ లో చెప్పే ప్రయత్నం చేశారు దిల్ రాజు. అయితే ఆ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. చాలామంది దిల్ రాజును ఇమిటేట్ చేస్తూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతున్న కారణంగా ఈ సినిమా ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ దిల్ రాజు గారిని ఉద్దేశిస్తూ సార్ ఈ సినిమాలో ఏమేమి ఉంటాయి చెప్పండి అంటూ తమిళ్లో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మీకు ఎన్న వెండుమో అన్ని ఈ సినిమాలో ఇరుకు అని చెప్పాడు. అంటే మీకు ఏ ఏ అంశాలు కావాలో ఇవన్నీ కూడా ఈ సినిమాల్లో ఉండబోతున్నాయి అని తమిళ్లో చెప్పాడు చరణ్. రామ్ చరణ్ ఇలా చెప్పడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి దిల్ రాజు అప్పట్లో మాట్లాడిన వీడియో కూడా వైరల్ గా మారింది.గేమ్ చేంజర్ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు పాటలు అద్భుతమైన సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో పాటను కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచింది అని చెప్పాలి.
Also Read : Game Changer First Review : గేమ్ ఛేంజర్ రివ్యూ చెప్పిన సుకుమార్… అన్ ప్రిడిక్టబుల్..!