Janu Lyri:జానూ లిరి (Janu Lyri).. ఫోక్ డాన్సర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఈ పేరు కంటే కూడా శేఖర్ మాస్టర్ (Shekhar master) ఈమెను పిలిచిన “జానూ.. జానూ.. జానూ” అనే పిలుపుతోనే మరింత ఫేమస్ అయిన ఈమె, ఢీ సెలబ్రిటీ విన్నర్ గా కూడా నిలిచింది. ఫోక్ డాన్సర్ గా పేరు సంపాదించుకున్న ఈమె అనేక టీవీ షో లతో పాటు స్టేజ్ షోలతో కూడా మరింత ఫేమస్ అయ్యింది. అయితే జానూ కి మాత్రం ఊహించని పాపులారిటీ లభించింది అంటే అది ఢీ షో వల్లే అని చెప్పవచ్చు. ఈ షోలో సాధారణ డాన్సర్ గా వచ్చి విజేతగా నిలవడంతో ఈమె పేరు మారుమ్రోగింది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మామూలుగా లేదు. ఎంత ఎంకరేజ్ అంటే జాను పేరు వినిపిస్తే చాలు శేఖర్ మాస్టర్ ప్రస్తావన వచ్చేంత రేంజ్ లో ఆయన ప్రోత్సహించారు.
బిగ్ బాస్ 9లోకి జానూ లిరి..
ఇక ఇప్పుడు జాను స్థాయి డాన్సర్ రేంజ్ నుండి మెంటర్ గా, డాన్స్ షోలకు జడ్జిగా ఎదిగిపోయింది. వీటితో పాటు కవర్ సాంగ్స్ తో కూడా ఈమె హల్చల్ చేస్తోంది. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, డాన్స్ ఐకాన్ ఇలా చాలా టీవీ షోలలో కనిపించిన ఈమె.. బిగ్ బాస్ సీజన్ 9 లోకి కూడా అడుగుపెట్టబోతోంది అంటూ వార్తలు వస్తుండగా.. వీటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది జాను. ఇకపోతే స్టార్ మా చానల్లో ఈ వారం నుంచి “కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్” సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. దాదాపు ఈ షోలో కనిపించిన వాళ్ళని బిగ్ బాస్ లో కూడా తీసుకుంటూ ఉంటారు. ఇందులో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్లని ముందు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారమే బిగ్ బాస్ లోకి పంపిస్తారు. అలా గత సీజన్లో ప్రియాంక జైన్ , శోభా శెట్టి, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్, అంబటి అర్జున్ వీళ్లంతా కూడా “కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్” నుంచి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన వాళ్లే. ముఖ్యంగా ఈ షో లో కంటెంట్ ఇచ్చిన వారిని బిగ్ బాస్ లోకి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఈ సీజన్ లో జబర్దస్త్ ఇమ్మానుయేల్, జబర్దస్త్ ఐశ్వర్య, యాంకర్ నిఖిల్, యూట్యూబర్ బంచిక్ బబ్లూ , మల్లి సీరియల్ ఫేమ్ లాస్య, ఉమ్మడి కుటుంబం సీరియల్ ఫేమ్ అనాల సుస్మిత తదితరులు బిగ్ బాస్ సీజన్ 9 కి వచ్చే అవకాశాలు దాదాపు కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన జానూ..
వీరితోపాటు శేఖర్ మాస్టర్ శిష్యురాలు జాను కూడా హౌస్ లోకి రాబోతుందంటూ వార్తలు రాగా.. ఆమె మాట్లాడుతూ.. “బిగ్ బాస్ ఆఫర్ నాకు రెండుసార్లు వచ్చింది. కానీ వెళ్ళను. నెక్స్ట్ సీజన్ జాను కన్ఫామ్ అంటున్నారు. కానీ వాళ్ళు కన్ఫర్మ్ అనుకున్నా నేను వెళ్ళాలి కదా.. ఖచ్చితంగా నేను వెళ్ళను. నేను సున్నాల దగ్గర ఆగిపోయేదాన్ని కాదు.. రూ.1లక్ష, రూ.5లక్షలు ఇలా ఎంతైనా సరే ఈ జానుని డబ్బుతో ఎవరు కొనలేరు” అంటూ ఓ రేంజ్ లో యాటిట్యూడ్ చూపిస్తూ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. గతంలో ఈమె లాగే విష్ణుప్రియ (Vishnupriya) కూడా ఇలాంటి కామెంట్లు చేసింది. కానీ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేయక తప్పలేదు. ఇక జాను కూడా భవిష్యత్తులో హౌస్ లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Decoit: మళ్లీ ఆగిపోయిన డెకాయిట్.. ఈసారి మృణాల్ కూడా కాపాడలేకపోయిందా..?