BigTV English

Decoit: మళ్లీ ఆగిపోయిన డెకాయిట్.. ఈసారి మృణాల్ కూడా కాపాడలేకపోయిందా..?

Decoit: మళ్లీ ఆగిపోయిన డెకాయిట్.. ఈసారి మృణాల్ కూడా కాపాడలేకపోయిందా..?

Decoit:యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Shesh) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్ (Decoit). ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కూడా లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ మూవీని ప్రకటించి చాలా రోజులు అవుతున్నా.. ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకులకు తెలియకుండా దాచేస్తున్నారు మేకర్స్. మరొకవైపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో పలు రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ చిత్ర బృందంతో విభేదాలు రావడంతో ఆమె అనూహ్యంగా మధ్యలోనే తప్పుకుంది.


ఆగిపోయిన డెకాయిట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..

దాంతో చివరికి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ను తీసుకున్నారు. అంతేకాదు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా మృణాల్ ను కన్ఫామ్ చేస్తూ.. ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ పలు రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడాన్ని మృణాల్ కూడా అడ్డుకోలేకపోయింది అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం స్పందించింది. చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ.. “డెకాయిట్ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు. షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. త్వరలోనే అప్డేట్లు వదులుతాం.. మూవీ విషయంలో వచ్చే ఎలాంటి పుకార్లు కూడా నమ్మవద్దు” అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే సినిమా షూటింగ్ జరుగుతోందని టీం క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడు వదులుతుందో చూడాలి. ఇకపోతే అడివి శేష్ తో పాటు మృణాల్ కూడా వరుస హిట్లతో జోరు మీద కొనసాగుతోంది. మరి ఈ జంట తెరపై చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి.


డెకాయిట్ సినిమా విశేషాలు..

డెకాయిట్ సినిమా విషయానికి వస్తే.. అడివి శేష్ , మృణాల్ ఠాగూర్ జంటగా షానియాల్ డియో రచన, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇద్దరు మాజీ ప్రేమికులు వారు వారి జీవితాలను మార్చుకోవడానికి దోపిడీలకు పాల్పడతారు. ఇక ఆ దోపిడీలో వారు ఎదుర్కొన్న సవాల్లేంటి.? ఇద్దరి దోపిడీ దారులు కలిస్తే ఏం జరిగింది? అనే విషయాలు తెరపై చూపించనున్నారు. ఎప్పుడో 2024 డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఇన్స్పెక్టర్ స్వామి పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ అప్డేట్స్ లేకపోవడం వల్ల అభిమానులు ఈ సినిమాను మరిచిపోయే స్టేజ్ వస్తుందని కూడా అభిమానులు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా చిత్ర బృందం ఈ సినిమాపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×